డిఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారా..?

డీఎస్సీ పరీక్షను ఈసారి అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో నిర్వహించే విషయమై ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.

Last Updated : Dec 22, 2017, 08:30 PM IST
డిఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారా..?

డీఎస్సీ పరీక్షను ఈసారి అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో నిర్వహించే విషయమై ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 5 లక్షలకు పైగానే అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆన్‌‌లైన్‌లో నిర్వహిస్తే.. ఫలితాలను సులభంగా ప్రకటించవచ్చన్న ఉద్దేశంతో ఏపీపీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.  తెలుగు, తమిళం, ఆంగ్లం, ఒరియా, మరాఠి, ఉర్దూ మాధ్యమాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు

కావున.. తగినన్ని కంప్యూటర్లు కూడా అందుబాటు ఉండాల్సిన అవసరం ఉందని... అలాగే టెక్నికల్ టీమ్ ఏర్పాటుకు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టాలని పాఠశాల విద్యా శాఖ, ఏపీపీఎస్సీని కోరినట్లు సమాచారం. 2018-19 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ సర్కారు కోరుకుంటున్నందున పనులను వేగవంతం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

 

Trending News