Bigg Boss 4 Second Week Nominations: పడవ ప్రయాణం.. అంత ఈజీ కాదు గురూ!

టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ బిగ్ బాస్ 4 హౌస్ నుంచి బయటకు వెల్లిన వెళ్లిన కొత్త సభ్యుడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ (Bigg boss 4 Second Week Nominations) నేటి రాత్రి మొదలుకానుంది.

Last Updated : Sep 14, 2020, 07:06 PM IST
  • బిగ్ బాస్ 4 తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి
  • రెండో వారం నామినేషన్ ప్రక్రియ నేటి రాత్రికి షురూ
  • పడవ ప్రయాణం.. దిగితే నామినేషన్‌కు గల్లంతే మరి
Bigg Boss 4 Second Week Nominations: పడవ ప్రయాణం.. అంత ఈజీ కాదు గురూ!

గత వారం ఎంతో సంబరంగా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4 (Bigg Boss Telugu 4)ను హోస్ట్ ‘కింగ్’ నాగార్జున ప్రారంభించారు. చూస్తుండగానే తొలి వారం నామినేషన్లతో పాటు ఎలిమినేషన్ సైతం పూర్తయింది. టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ అయ్యారు. సూర్యకిరణ్ బయటకు హౌస్ నుంచి బయటకు వెల్లిన వెళ్లిన కొత్త సభ్యుడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. Surya Kiran Eliminated: బిగ్ బాస్ 4 తొలి ఎలిమినేషన్ ముందే ఊహించారు! 

రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ (Bigg Boss 4 Second Week Nominations) నేటి రాత్రి మొదలుకానుంది. బిగ్ బాస్ 4 రెండో వారం ఎలిమినేషన్‌లో భాగంగా నేడు నామినేషన్ల కోసం టాస్క్ ఇవ్వనున్నారు. పడవ ప్రయాణం అంత ఈజీ కాదనే టాస్క్ ఇచ్చినట్లు స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఈ సీజన్ స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ మాత్రం డేర్ చేస్తూ.. నేను దిగిపోతానంటూ డేరింగ్‌గా లేవడం మరింత ఆసక్తికరంగా మారింది..Malaika Arora: కరోనా వ్యాక్సిన్‌పై మలైకా అరోరా పోస్ట్.. వైరల్  

పడవ (Boat Task For Bigg Boss 4 Second Week Nominations) కనిపించగానే బిగ్ బాస్ ఇంటి సభ్యులు పరుగెత్తికొచ్చి ఎక్కేశారు. ఎక్కిన తర్వాత తెలిసింది పడవ ప్రయాణం అంత ఈజీ కాదని. పడవ నుంచి ఒక్కో సభ్యుడు లేక సభ్యురాలు దిగాల్సి వస్తుంది. పడవ దిగిపోయిన ఒక్కొక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ 4 రెండో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయినట్లు అని బిగ్ బాస్ ఎప్పటిలాగే కండీషన్ చల్లగా చెప్పేసరికి హౌస్ సభ్యులలో కాస్త ఆందోళన మొదలైంది. 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News