ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) తీరానికి సమీపంలో మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో ( Bay of Bengal ) అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
రానున్న 4-5 రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ( Heavy rains ) పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీ తీరానికి ( Ap coastal ) సమీపంలో సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ కారణంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటిత వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మాత్రం దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి, మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ఎల్లుండ కూడా వాతావరణం ఉండనుందని వాతావరణ శాఖ ( IMD ) తెలిపింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. అటు రాయలసీమలో ఇవాళ్టి నుంచి మూడ్రోజుల వరకూ మోస్తరు వర్షాలు పడవచ్చు. Also read: AP: అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు