ఇండో చైనా సరిహద్దు ప్రాంతమైన లడాఖ్ ( ladakh ) లో ఇకపై చైనా చొరబాట్లకు చెల్లుచీటి పాడనుంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. పినాకా రాకెట్ లాంచర్లను ఆరు మిలట్రీ రెజిమెంట్లకు అందించేందుకు ఒప్పందమైంది.
ఇండియా చైనా సరిహద్దు ( Indo china border ) వివాదానికి కేంద్ర బిందువైన లడాఖ్ లో సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆరు మిలట్రీ రెజిమెంట్లకు పినాకా రాకెట్ లాంచర్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు 2 వేల 580 కోట్ల ఖర్చుతో రెండు దేశీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ( TPCL ), లార్సెన్ అండ్ టూబ్రో ( L & T ) లతో ఈ ఒప్పందాలయ్యాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ( Bharat Earth movers limited ) కూడా ఈ మెగా ప్రాజెక్టులో పార్టనర్ గా ఉండనుంది. ఈ రాకెట్ లాంచర్ల ద్వారా చైనా చొరబాట్లను నియంత్రించడానికి వీలవుతుంది. అటు భారత పాకిస్తాన్ సరిహద్దులో కూడా పినాకా రాకెట్ లాంచర్లను మొహరించనున్నారు. మొత్తం 6 రెజిమెంట్లలో 114 ఆటోమేటెడ్ లాంచ్ లు, 45 కమాండ్ పోస్టులతో పాటు ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్ అండ్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ రెజిమెంట్లలో రాకెట్ లాంచర్ల ఏర్పాటు ద్వారా సైన్యం బలోపేతమవుతుంది. తద్వారా పాకిస్తాన్, చైైనా చొరబాట్లను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు ఇండియన్ ఆర్మీకు బలం చేకూరుతుంది. Also read: Metro Rail services: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ఎలా ఉండనున్నాయి ?