మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం ఆచార్యలో ( Acharya movie ) నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) జంటగా నటిస్తోంది. గత కొద్ది రోజుల నుండి రచయిత-అసోసియేట్ డైరెక్టర్ అయిన రాజేష్ ( Rajesh ) అనే వ్యక్తి తన స్టోరీ ఐడియాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆచార్య సినిమా మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ మోషన్ పోస్టర్ చూసిన తరువాత ఆ స్టోరీ తనదేనని రాజేష్ మరోసారి ఆరోపించాడు. Also read : Pushpa movie: నా కథను కాపీ కొట్టారంటూ సుకుమార్‌పై ప్రముఖ రచయిత ఆరోపణలు
ఐతే ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తు మేకర్స్ ఈ రోజు అధికారికంగా ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ఆచార్య మోషన్ పోస్టర్‌ను ( Acharya movie motion poster ) చూసి కొంతమంది రచయితలు ఈ కథ తమదేనని భాస్తున్నారు. కానీ, ఆచార్య కథ కోరటాల శివ రాసుకున్న ఒరిజినల్ స్టోరీ అని దాని పూర్తి హక్కులు, బాధ్యత కొరటాలదే అని మేకర్స్ స్పష్టం చేశారు. Also read : Ram Charan: రాంచరణ్ డ్రీమ్ ప్రాజెక్టు అదేనట
ఈ చిత్రాన్ని కొనిడెలా ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) కూడా అతిధి పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు, మలయాళ చిత్రం అయిన లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. Also read : AVPL TRP Rating: అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఖాతాలో అరుదైన రికార్డు
Acharya controversy: ఆచార్య కథ కాపీనా ? స్పందించిన నిర్మాతలు
ఆచార్య సినిమా కథను తన కథ నుంచి కాపీ కొట్టారని ఆరోపిస్తున్న రాజేష్.
రాజేష్ ఆరోపణలను ఖండిస్తూ ఆచార్య చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రెస్ నోట్ విడుదల.