విజయవాడ స్వర్ణ ప్యాలేస్ ( Vijayawada Swarna palace ) అగ్నిప్రమాదం నేపధ్యంలో కోవిడ్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం నిఘా పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నవాటిపై చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొన్ని కోవిడ్ సెంటర్ల ( Covid centres ) అనుమతుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో రమేష్ ఆసుపత్రి ( Ramesh hospital ) నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఏపీ ప్రభుత్వం ( Ap Government ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ సెంటర్లపై నిఘా పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నవాటిపై చర్యలకు దిగుతోంది. సరైన సదుపాయాలు లేనివాటిపై, రోగుల్నించి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నవాటిపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ చర్యల్లో భాగంగా ఒక్క విజయవాడలోనే ఐదు కోవిడ్ సెంటర్ల అనుమతుల్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ రద్దు చేసింది. వీటిలో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ ప్యాలేస్ ( Swarna palace ), డాక్టర్ లక్ష్మీ నర్శింగ్ హోమ్ ఆధ్వర్యంలోని హోటల్ అక్షయ ( Hotel Akshaya ), ఇండో బ్రిటీష్ ఆసుపత్రికి చెందిన హోటల్ ఐరా ( Hotal Ira ), ఎన్ ఆర్ ఐ హీలింగ్ హ్యాండ్స్, ఆంధ్రా హాస్పటల్స్ కు చెందిన సన్ సిటీ ( Sun city ), కృష్ణమార్గ ( krishna marg ) కోవిడ్ సెంటర్ల అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కోవిడ్ సెంటర్లపై రోగుల నుంచి ఫిర్యాదులు అందినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.