Haldi Ceremony: నిహారిక పెళ్లి పనులు షురూ..

మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు ( Nagababu ) కూతురు నిహారిక ( Niharika ) నిశ్చితార్థం ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో జరిగిన విషయం తెలిపింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ మహోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది.

Last Updated : Aug 18, 2020, 09:44 AM IST
Haldi Ceremony: నిహారిక పెళ్లి పనులు షురూ..

Niharika Haldi Ceremony:  మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు ( Nagababu ) ముద్దుల కూతురు నిహారిక ( Niharika ) నిశ్చితార్థం ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో జరిగిన విషయం తెలిపింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ మహోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఒక్క పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) మినహా.. మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), రామ్ చరణ్, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మొత్తం ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇలీవలనే ఈ వేడుక‌కి సంబంధించిన వీడియోని నాగ‌బాబు విడుద‌ల చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో వివాహా క్రతువుకు సంబంధించిన మరో వీడియోను నిహారిక షేర్ చేసి మెగా ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

With all my lovelies @sarmistakolla @varsha_sirisha @aiswaryabuddhavarapu @sahaana.sakhamuru @sushmitakonidela @deepthikay @sreeja_kalyan @ambatibhargavi 📸 @vowsbysiddhusoma Decor by @partywithjoandco Hair by @koduruamarnath

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఈ నెల‌లోనే నిహారిక పెళ్ళి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. పెళ్ళి ప‌నుల‌లో ముఖ్య‌మైన ప‌సుపు దంచే కార్య‌క్ర‌మాన్ని సోమవారం మెగా కుటుంబం వైభవంగా నిర్వ‌హించింది. ఈ కార్యక్రమంతో పెళ్లి పనులు చకచకా నడుస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ కార్యక్రమానికి నిహారిక అక్క చెల్లెళ్లు, తోడి కోడ‌ళ్ళు, అత్త‌లు అంద‌రు హాజ‌ర‌య్యారు. దీనికి సంబంధించిన వీడియోని నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, అది ప్రస్తుతం వైర‌ల్‌గా మారింది. Also read: Niharika engagement: నిహారిక ఎంగేజ్‌మెంట్‌కి పవన్ కల్యాణ్ అందుకే రాలేదట

Trending News