కొన్ని సందర్భాల్లో మన స్నేహితులే, మన ఫ్రెండ్ లిస్టులోని ఇతర స్నేహితులకు కూడా మన ప్రమేయం లేకుండా వారి ప్రైవసీకి భంగం కలిగించే ప్రయత్నం చేయవచ్చు. వారిని కూడా తమ స్నేహితుల జాబితాలో జత చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
అలాంటప్పుడు మీరు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరికీ కనబడకుండా చేసే సౌలభ్యం కూడా ఉంది. అందుకు మీరు చేయాల్సింది ఏమిటంటే.. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ పేజీలోని Friends అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఆ ఆప్షన్ పై క్లిక్ చేశాక Find Friends అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. ప్రైవసీ సెట్టింగ్స్ కోసం మీరు దాని పక్కన కనిపించే పెన్ గుర్తుపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. పెన్ గుర్తుపై క్లిక్ చేయగానే అక్కడ Edit Privacy అనే మరో ఆప్షన్ ఓపెన్ అవుతుంది.
Edit Privacy పై క్లిక్ చేసిన తర్వాత మీకు Who can see your Friends List అనే మరో టాబ్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ కనిపించే Only me అనే మరో ఆప్షన్ పై క్లిక్ చేస్తే, మీ ఫ్రెండ్స్ లిస్ట్ మీకు తప్ప ఇంకెవరికీ కనబడదు.