Aaditya Thackeray breaks silence: న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసుపై రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసుపై బాలీవుడ్‌తోపాటు మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం కుమారుడు, శివసేన నేత, మంత్రి ఆదిత్య థాక్రే ( Aaditya Thackeray ) మౌనం వీడారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సినీ పరిశ్రమలో ఉన్నవారితో తనకు మంచి పరిచయాలుండటం నేరమేమి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో తనకు ఏ సంబంధం లేదని ఈ మేరకు మంగళవారం ఆదిత్య థాక్రే మరాఠీలో ఒక ప్రకటన విడుదల చేశారు. Also read: SSR death case: మహా సర్కార్‌కి బీహార్ సర్కార్ నుంచి మరో షాక్
People are doing mud slinging on me personally and members of the Thackeray family.... I have no connection with #SushantSinghRajput's death in any manner. This is politics over someone's death: Maharashtra Minister Aaditya Thackeray in a statement pic.twitter.com/jYv6Wj1Zfm
— ANI (@ANI) August 4, 2020
సుశాంత్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని. ప్రతిపక్ష పార్టీలు కావాలనే శవరాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే.. దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర పోలీసులకు అప్పగించాలని సూచించారు. తాను బాలాసాహెబ్ థాక్రే మనవడినని, మహారాష్ట్ర గౌరవానికి, శివసేన, థాక్రే కుటుంబానికి మచ్చ తెచ్చే ఏ పని తాను చేయనని ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు. Also read: Sushant death case: సుశాంత్ మృతి కేసులో కీలక పరిణామం