ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఫోటోని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. ఫలూడా సెంటర్లో పనిచేసే వెయిటర్స్ బట్టలు అచ్చం "నేనే రాజు నేనే మంత్రి" సినిమాలో హీరో రానా వేసుకున్న బట్టల్లా ఉన్నాయని కామెంట్ చేశారు. ఈ సినిమాలో రానా చొక్కా పై భాగంలో చిన్న చిన్న జేబులు ఉంటాయి. అయితే ఫలూడా సెంటర్లో వెయిటర్లు ఆ జేబుల్లోనే స్ట్రాస్ పెట్టుకోవడం.. ఆ జేబుల్లోంచే స్ట్రాస్ తీసి కస్టమర్లకు సప్లై చేయడంతో.. బహుశా వారికి రానా సినిమా ఆదర్శం కావచ్చు అని కూడా కొందరు ట్వీట్ చేశారు. "మీకు తెలీదేమో.. ఆ వెయిటర్లకి నా సినిమా ఆదర్శం కాదు. వాళ్లనే ఆదర్శంగా తీసుకొని ఆ డ్రస్ వేసుకొని నేను ఆ సినిమాలో నటించాను" అని ట్వీట్ చేశారు రానా.
Look how workers at Baba Falooda had their sleeve inspired from #nrnm @RanaDaggubati
But they use it to store straws instead of cigars 😂😂😂 @SureshProdns pic.twitter.com/5ew9UnE1Hf— queen kiwi (@trishajulka) December 4, 2017
We picked it from them :) Just made it made it made dramatic 😉 https://t.co/Vb6wQKK4kt
— Rana Daggubati (@RanaDaggubati) December 5, 2017