గత 24 గంటల్లో దేశంలో రికార్డు కరోనా కేసులు, మరణాలు

కరోనా వైరస్‌ (CoronaVirus Cases In India)ను ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి చూపించిన స్థాయి నుంచి మహమ్మారి వల్ల అధికంగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Last Updated : Jun 4, 2020, 01:51 PM IST
గత 24 గంటల్లో దేశంలో రికార్డు కరోనా కేసులు, మరణాలు

కరోనా వైరస్‌ (CoronaVirus)ను దాదాపుగా జయించిన స్థితి నుంచి ప్రాణాంతక మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న దేశంగా భారత్ మారిపోయింది. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 9,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకూ (జూన్ 4న) నమోదదైన కరోనా కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన కేసులలో ఇదే అత్యధికం కావడం ఆందోళన కలిగిస్తోంది.  సూపర్ ఐడియా.. క్యాబ్‌లో నిశ్చింతగా ప్రయాణం

గత 24 గంటల్లో భారత్‌లో (India CoronaVirus Deaths) ఏకంగా 260 మందిని కరోనా బలిగొంది. ఒక్కరోజు మరణాలలో ఇదే అత్యధికం. కాగా, ఇందులో మహారాష్ట్రలోనే 122 మంది చనిపోగా, ఢిల్లీలో 50, గుజరాత్‌లో 30, తమిళనాడులో 11, పశ్చిమ బెంగాల్ 10, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో 7 చొప్పున, రాజస్థాన్‌లో 6, ఆంధ్రప్రదేశ్‌లో 4, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఒక్కోక్కరు కరోనా బారిన పడి చనిపోయారు.  మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 1,513 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 Cases) రావడం గమనార్హం. దీంతో దేశ రాజధానిలో 23,000 మార్క్ చేరుకోగా, కరోనా మరణాల సంఖ్య 606 చేరింది. కరోనా వైరస్ కేసుల విషయానికొస్తే ప్రపంచ దేశాల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాం. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే, స్పెయిన్, ఇటలీలు మాత్రమే భారత్‌ కంటే అధికం కరోనా కేసులను కలిగి ఉన్న దేశాలు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
 

Trending News