ఓవైపు 'కరోనా వైరస్' విలయ తాండవం చేస్తోంది. మరోవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఈ క్రమంలో లాక్ డౌన్‌కు సడలింపులు ఇచ్చారు.పాక్షికంగా ఆంక్షలు తొలగించి మళ్లీ జీవిత చట్రాన్ని పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు అందరిదీ ఒకటే మాట..కరోనా వైరస్‌తో కలిసి బతకాల్సిందే..! ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే చెప్పారు. శాశ్వతంగా లాక్ డౌన్లో బతలేకమని స్పష్టం చేశారు. సాధారణ జీవితం ఇప్పట్లో కాస్త గగనమే అయినప్పటికీ.. తప్పనిసరిగా మళ్లీ పరిస్థితులు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఢిల్లీలో రోజు రోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఐతే దీని గురించి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఢిల్లీలో కేసుల సంఖ్య దాదాపు 18వేలకు చేరువలో ఉంది. ఐతే వాటిలో కేవలం 2 వేల 100 మంది మాత్రమే ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని.. మిగతా వారందరికీ ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కునేందుకు వివిధ ఆస్పత్రులలో 6 వేల 500 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే వచ్చే వారం నాటికి మరో 9 వేల 500 పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
#WATCH: "Most of the people are recovering, and they are recovering at home. There is no need to panic," says Delhi CM Arvind Kejriwal #COVID19 pic.twitter.com/92ELnfqgKV
— ANI (@ANI) May 30, 2020
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..