ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా పరిస్థితిని మాటల్లో చెప్పలేము. అమెరికాలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. అత్యధిక మరణాలు నమోదు చేసిన దేశంతో పాటు లక్ష కరోనా మరణాలు నమోదు చేసిన ఏకైక దేశం అమెరికా. శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
United States of America has now recorded more than 1 lakh #coronavirus-related deaths, the highest in the world as per Johns Hopkins University: AFP news agency
— ANI (@ANI) May 28, 2020
అమెరికాలో తాజాగా 7,624 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 17, 13,850కి చేరింది. మరోవైపు అక్కడ ఇప్పటివరకూ 1,00,090 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా మరణాలపై జాన్ హాప్కిన్స్ యూనివిర్సిటీ సమాచారం అందిస్తోంది. లాక్డౌన్ పెళ్లి సందడి చిత్రాలివిగో..
కాగా, ప్రపంచ దేశాల ఈ దుస్థితికి ప్రధాన కారణం చైనాయేనని అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. చైనానే కరోనా వైరస్ను క్రియేట్ చేసి ప్రపంచ దేశాల మీదకి వదిలిందన్న కోణంలో అమెరికా అధికారులు దర్యాప్తు సైతం ప్రారంభించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
కరోనా కల్లోలం.. అమెరికాలో లక్ష దాటిన మరణాలు