జీహెచ్ఎంసీ పరిధిలో పన్ను చెల్లించని వారిని అధికారులు అలర్ట్ చేశారు. పన్నులు చెల్లించని 8 లక్షల 24 వేల మందికి GHMC అధికారులు వాట్సాప్లో సందేశాలు పంపించారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన ఆఫర్ను స్వీకరించిన పన్ను చెల్లింపుదారులు లాక్డౌన్ అని లెక్కచేయకుండా ఎర్లీ బర్డ్ ఆస్తి పన్ను పథకం (Early Bird scheme)లో భాగంగా టాక్స్ కట్టేందుకు క్యూ కడుతున్నారు. T20 వరల్డ్ కప్ రద్దు!
ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ ఆస్తి పన్ను కింద 5శాతం రాయితీతో టాక్స్ చెల్లించే అవకాశం కల్పించారు. దీంతో జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్ల వద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా మే 31వరకు పన్ను రాయితీ పొందవచ్చునని జీహెచ్ఎంసీ వాసులకు సందేశం రూపంలో తెలిపారు. మరో 5 రోజులే గడువు కావడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ సూచన మేరకు నగరవాసులు పన్ను చెల్లిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి