/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

కోయంబత్తూరు : సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing )... కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ఔషదం కంటే అతి ముఖ్యమైనది. ఇక మన జీవితాల్లో ఒక భాగం కావాల్సింది. కానీ కారణాలేవైనా అక్కడక్కడా ఆ సోషల్ డిస్టన్సింగ్ అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. అటువంటి దృశ్యమే ఒకటి తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ( Coimbatore in TamilNadu) కనిపించింది. ఇది కేవలం కోయంబత్తూరులోనే కాదు.. దేశం నలమూలల ఇటువంటి దృశ్యాలే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చిక్కుకుపోయిన వలసకూలీలను ( Migrant workers ) స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను ( Shramik special trains ) నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోయంబత్తూర్‌లోని సుందరాపురంలో ఉన్న వలసకూలీలు ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌లోని తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన ట్రెయిన్ పాసులను ( Train passes ) తీసుకునేందుకు గుమిగూడినప్పుడు కెమెరాకు చిక్కిని దృశ్యం ఇది. ( Also read : Lockdown: రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. )

 

లాక్ డౌన్ ( Lockdown ) నేపథ్యంలో పనులు కరువవడంతో సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వలస కూలీలు.. అందులో అడ్డం వచ్చిన ఏ కష్టాన్ని, ఏ నిబంధనను లెక్క చేయడం లేదని చెప్పడానికి ఈ దృశ్యాన్ని ఒక నిదర్శనంగానూ చెప్పుకోవచ్చు. (Also read : కరోనాతో తెలంగాణలో మరో నలుగురు మృతి )

ఇదిలావుంటే, మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 1,565 శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ద్వారా 20 లక్షలకుపైగా రైలు ప్రయాణికులను ( Train passengers ) వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) ప్రకటించింది. మరోవైపు అంఫాన్ తుఫాన్ (Cyclone Amphan ) కారణంగా వెస్ట్ బెంగాల్ ( West Bengal ) వైపు వెళ్లే పలు శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Section: 
English Title: 
Migrant workers gathered to collect train passes for today's 'shramik special' trains in Coimbatore
News Source: 
Home Title: 

సోషల్ డిస్టన్సింగ్ లేదు.. రైలు ఎక్కాలనే ఆందోళన తప్ప

Shramik special trains : ఇంకెక్కడి సోషల్ డిస్టన్సింగ్ ?
Caption: 
ANI source
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Shramik special trains : ఇంకెక్కడి సోషల్ డిస్టన్సింగ్ ?
Publish Later: 
Yes
Publish At: 
Wednesday, May 20, 2020 - 12:33