సాహోరే.. బాహుబలి.. సాహో

ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య (ఎన్బిఏ-  NBA) లో 'బాహుబలి 2' సినిమాలోని సాహోరే బాహుబలి పాటకు బాస్కెట్ కోర్టులో సెప్పులేశారు యువతులు. 

Last Updated : Nov 29, 2017, 03:48 PM IST
సాహోరే.. బాహుబలి.. సాహో

ఎస్ ఎస్ రాజమౌళీ తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం  1,2 వ పార్టులు ఎంత హిట్టో జనానికి తెలుసు...! తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో అనువాదమై ఆయా రాష్ట్రాల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగించింది. ప్రభాస్ కు దేశవ్యాప్తంగా సినీ అభిమానులను సంపాదించింది. బాలీవూడ్ లో  'బాహుబలి' రిలీజయ్యాక.. ఒక ప్రాంతీయ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంత పెద్ద హిట్ కావడం అదే తొలిసారి. 

ఎస్ ఎస్ రాజమౌళీ తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా ఫీవర్ ఇంకా జనాలకు పోయినట్టు లేదు. అందుకు నిదర్శనం ఈ సన్నివేశం.

కొంత మంది పిల్లలు ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య (ఎన్బిఏ-  NBA) లో 'బాహుబలి 2' సినిమాలోని సాహోరే బాహుబలి పాటకు బాస్కెట్ కోర్టులో సెప్పులేశారు. తాజాగా ఈ వీడియోను జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య- ఇండియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పసుపు దుస్తుల్లో సూపర్ హిట్ పాటకు యువతులు నృత్యం చేస్తూ కోర్టులో ప్రేక్షకులను మెప్పించారు. 

Trending News