ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు ఇటీవల హార్ట్ సర్జరీ చేశారని, అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉందని కథనాలు వస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కిమ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. మంగళవారం వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ట్రంప్ స్పందించారు. COVID-19 ఆఫీసర్స్ పోస్టులు.. అప్లై చేశారా!
కిమ్ జాంగ్ ఉన్‌కు, తనకు మధ్య రిలేషన్ అంతగా బాగాలేదని.. అయినా సరే నార్త్ కొరియా నియంత త్వరగా కోలుకోవాలని మాత్రం ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కిమ్ పరిస్థితి విషమంగా ఉందని వార్తలు చదివానని, తానే స్వయంగా కిమ్ ఆరోగ్యంపై వాకబు చేయనున్నట్లు చెప్పారు. ఆ కథనాల్లో వాస్తవమెంతో తనకు తెలియదని, ఏదో విధంగా సమాచారాన్ని సేకరిస్తామన్నారు. Photos: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్
దక్షిణ కొరియా సైతం కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సర్జరీ అనంతరం కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం నిలకడగా లేదన్న కథనాలపై ఇప్పుడే స్పందించలేమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్యోంగ్ యాంగ్ లోని ఓ రిసార్టులో కిమ్‌కు గుండె ఆపరేషన్ జరిగిందని అమెరికా, తదితర దేశాల మీడియా రిపోర్ట్ చేసింది. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!
కాగా, కిమ్ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ 2 సంగ్ జయంతి వేడుకలకు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గైర్హాజరు అవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 15న ఆ వేడుకలకు కిమ్ దూరంగా ఉండటంతో అసలేం జరిగిందని, కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారా లేదా అనే విషయాలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..