న్యూఢిల్లీ : కరోనావైరస్ కారణంగా దేశంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోననే టెన్షన్ ప్రస్తుతం భారతీయులను వేధిస్తోందట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిందేంటంటే.. ప్రతీ ఐదుగురు భారతీయులలో ఒకరిని జాబ్ లాస్, పే కట్ వంటి ఆందోళనకు గురవుతున్నారని. ఇంకా చెప్పాలంటే.. లాక్ డౌన్ కారణంగా చాలా వ్యాపార సంస్థలు నష్టాలు చవిచూస్తుండటంతో తమ ఉద్యోగం ఉంటుందో పోతుందోననే టెన్షన్ ఒకవైపు... ఒకవేళ ఉద్యోగం ఉన్నా.. వేతనం పూర్తిగా అందుతుందో లేక కోతకు గురవుతుందోననే టెన్షన్ మరోవైపు వేధిస్తున్నాయట. కరోనావైరస్ కంటే ఎక్కువగా ఈ రెండు విషయాల్లోనే తాము ఎక్కువ ఆందోళనతో ఉన్నట్టు పౌరులు తెలిపారు. ఇంటర్నెట్ ఆధారిత మార్కెట్, డేటా ఎనాలసిస్ జరిపే యూగవ్ (YouGov) అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
Also read: Doctor dies of COVID-19: కరోనాతో డాక్టర్ మృతి.. ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్
కరోనావైరస్ను నియంత్రించడం కోసమే లాక్డౌన్ విధించినప్పటికీ.. ఆ లాక్ డౌన్ కారణంగా ఆర్థికమాంద్యం పెరుగుతుందని ఇప్పటికే చాలా మంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే, ఆర్థికమాంద్యం పెరిగితే దాని పర్యావసనం ఉద్యోగాలపైనే కనిపిస్తుందనేది వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాలు ఉంటాయా లేక ఊడుతాయా ? ఒకవేళ ఉద్యోగం ఉన్నా.. అంతకు ముందులా పూర్తి వేతనం చేతికొస్తుందా లేక కోత పడుతుందా అనేదే ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్తులను వేధిస్తున్న అంశం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..