భోపాల్: గత కొన్నిరోజులుగా అజ్ఞాత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అయితే తన మొబైల్ ఫోన్ ను స్విచాఫ్ చేశానని, అజ్ఞాత ఫోన్ కాల్స్ బెడద మరింత తీవ్రతరం కావడంతో మధ్యప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
Read Also: ప్రజల గోడు వినండి.. ప్రధానిపై ఫైర్ అయిన చిదంబరం..
గత వారం రోజులుగా నిరంతరంగా వస్తున్న ఫోన్ కాల్స్ తో ఇబ్బందిగా ఉందని, ఈ సమాశంపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తో మాట్లాడినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన మొబైల్ ను స్విచాఫ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం తనకు కనిపించలేదని అన్నారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ, ఆయా ఫోన్ నంబర్ల స్క్రీన్ షాట్లను కూడా పంచుకున్నారు. వాటిలో కొన్ని ఇంటర్నేషనల్ నంబర్లు కూడా ఉన్నాయి.
ये वो फोन कॉल्स हैं जो 4/5 दिनों से मुझे परेशान कर रहे हैं। मैंने एमपी के डीजीपी को शिकायत भेजी। मैंने सर्विस प्रोवाइडर से भी बात की लेकिन ये बंद नहीं हो रहे। अफ़सोस इस हालत में मुझे अपने मोबाइल नंबर को ही बंद करना पड़ रहा है। pic.twitter.com/PTghiyOGHt
— digvijaya singh (@digvijaya_28) April 3, 2020
Also Read: కరోనా చికిత్సకు సహకరించని ముస్లింలకు అదే శిక్ష విధించాలి: రాజా సింగ్
మరోవైపు ఇదే అంశంపై మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు రామేశ్వర్ శర్మ స్పందిస్తూ, దిగ్విజయ్ సింగ్ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మొబైల్ స్విచాఫ్ చేసుకోవద్దని సూచించారు. కాగా దిగ్విజయ్ సింగ్ ఫోన్ కు వస్తున్న కాల్ డాటాను తనకు పంపించాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..