Venu swamy predictions on allu arjun and Tollywood industry video: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 మూవీ మేకర్స్ పై ఐటీదాడులు జరుగుతున్నాయి. వరుసగా.. దిల్ రాజు, సుకుమార్, మ్యాంగో కంపెనీ అధినేత రామ్ వీరపనేని, మైత్రీమూవీ మేకర్స్ కు సంబంధించిన ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే వేణుస్వామికి తెలంగాణ మహిళ కమిషన్ కాంట్రవర్సీ జరిగే విధంగా మాట్లాడొద్దని చివాట్టు పెట్టింది. గతంలో శోభితా, చైతులపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా సారీ సైతం చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వేణుస్వామి మరోసారి వార్తలలో నిలిచారు. తాజాగా.. ఆయన మరోసారి ఇండస్ట్రీలో జరుగుతున్న ఐడీ దాడులపై మాట్లాడారు. ఇది జెస్ట్ ట్రైలర్ మాత్రమే అని ఫ్యూచర్ లో మరింత గడ్డుకాలం ఎదుర్కొవాల్సి ఉంటుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వేణు స్వామి మరోసారి బన్నీ, సుకుమార్ జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ది కన్యారాశి, సుకుమార్ ది కుంభ రాశి అన్ని చెప్పారు. వీరిద్దరిది షష్టాష్టకం కాంబినేషన్ అని.. వీళ్ల జాతంలో శనిదేవుడు నీచ స్థానంలో ఉన్నాడని అన్నారు. దీని వల్ల అనుకొని ఘటనలు జరుగుతాయన్నారు. అందుకు గతంలో అల్లు అర్జున్ అనుకొని విధంగా ఇబ్బందుల్లో పడ్డారన్నారు.
Reada more: Janhvi Kapoor: తిరుమలలో పెళ్లి.. ముగ్గురు పిల్లలు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జాన్వీకపూర్.. మ్యాటర్ ఏంటంటే..?
2025 మార్చ్ 30 వరకు అల్లు అర్జున్, సుకుమార్ లకు శని బాలేడని..అందుకే అనేక ఇబ్బందులు తప్పవన్నారు. అందుకే పుష్ప2 యూనిట్ ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. అయితే.. ఇలాంటి ఇంకా అనేక షాకింగ్ ఘటనలు.. మార్చి 30 తర్వాత మరిన్ని జరుగుతాయని వేణుస్వామి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కొంత మంది నెటిజన్లు వేణు స్వామి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.