Student Suicide: బిల్డింగ్ పైనుంచి దూకేసిన అనంతపూరం నారాయణ కాలేజ్ విద్యార్థి.. వీడియో వైరల్...!

Anantapur Narayana College: అనంతపురం జిల్లా నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటున్న చరణ్ అనే యువకుడు హఠాత్తుగా కాలేజ్ మూడో భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 23, 2025, 03:48 PM IST
Student Suicide: బిల్డింగ్ పైనుంచి దూకేసిన అనంతపూరం నారాయణ కాలేజ్ విద్యార్థి.. వీడియో వైరల్...!

Student Jumps Off From College Building: విద్యార్థులు చదువుకోవాలని తమ తల్లిదండ్రులు సైతం ఎంతో కష్టపడి మరీ ప్రైవేటు కాలేజీలలో చేర్పిస్తూ.. అధిక ఫీజు భారమైన సరే కడుతూ ఉంటారు.. అయితే కొంతమంది కాలేజీ యాజమాన్యాలు, పెట్టేటువంటి ఒత్తిడి లను తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.. అలా ఇప్పటికే నారాయణ కాలేజీలో చాలామంది విద్యార్థులు కూడా మరణించిన సంఘటనలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాము. తాజాగా ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఒక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వాటి గురించి చూద్దాం. 

చరణ్ అనే యువకుడు ఇంటర్ మొదటి సంవత్సరం నారాయణ కళాశాలలో చదువుతున్నారట. ఈరోజు కళాశాలలో క్లాసులు జరుగుతూ ఉండగానే,, ఆ క్లాసు మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తూ అందరూ చూస్తుండగా బయటికి వచ్చి మూడవ అంతస్తు బిల్డింగ్ పైనుంచి కిందికి దూకాడు.. 

దీంతో చరణ్ కు తీవ్ర గాయాల పాలు అవ్వడంతో అతనిని వెంటనే కళాశాల బృందం హుటాహుటిగా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మరణించారట.  అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనే విషయం ఇంకా తెలియడం లేదట. 

అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర బాగోద్వేగానికి గురవుతున్నారు. అలాగే విద్యార్థి సంఘాలు కూడా కళాశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తూ నారాయణ కాలేజీ మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే కళాశాల యాజమాన్యం పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆందోళనకు దిగడం జరిగింది.. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటన స్థలానికి చేరుకొని మరి కళాశాల ఎదుట బందోబస్తుని సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

మొత్తానికి చరణ్ ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

 

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News