సాధారణంగానే సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతుంటాయి. అయితే కరోనా వైరస్ లాంటి మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నా కొందరు నెటిజన్లు తమకు తెలియని, అవాస్తవాలను పోస్ట్ చేయగా.. అది నిజమనుకుని మరికొందరు షేర్ చేయడంలో ఆ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏవి సత్యాలు, ఏవి అసత్యాలో తేల్చుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వదంతులు, అందులో నిజనిజాలను ఇక్కడ అందిస్తున్నాం..
వదంతులు 1) గొంతు తేమగా (తడిగా) ఉండేట్లు చూసుకుంటే కరోనా వైరస్ సోకదు
నిజం: శాస్త్రీయంగా దీనికి ఏ ఆధారం లేదు. డాక్టర్లు దీన్ని సూచించలేదు. ఇలాంటివి నమ్మవద్దు.
Claim: A moist throat can ensure protection from corona infection.
Fact: False. There is no scientific evidence to support this claim#coronavirusindia #coronavirus #IndiaFightsCorona #Mythbuster pic.twitter.com/ByXhjKAMQs— NDMA India (@ndmaindia) March 25, 2020
వదంతులు 2) విటమిన్ సీ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో కరోనా ఇన్ఫెక్షన్ బారి నుండి బయటపడొచ్చు
నిజం: క్రమం తప్పకుండా విటమిన్ సి పదార్థాలు తీసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. మరీ ఎక్కువగా విటమిన్ సి పండ్లు, పదార్థాలు తీసుకోకపోవడమే ఉత్తమం.
Claim: Heavy intake of Vitamin-C can help in curing corona infection.
Fact: Regular intake of Vitamin-C boosts immunity. However, excessive intake is not recommended. #coronavirusindia #coronavirus #IndiaFightsCorona #Mythbuster pic.twitter.com/6je3aa1GFX
— NDMA India (@ndmaindia) March 25, 2020
వదంతులు 3) 10 సెకన్లపాటు శ్వాసతీసుకోకుండా ఉండాలి. ఏ ఇబ్బంది తలెత్తకపోతే మీకు కోవిడ్19 (CoronaVirus) వైరస్ సోకనట్టే.
నిజం: పది సెకన్లపాటు శ్వాస తీసుకోవడం ఆపిస్తే.. ఇబ్బంది తలెత్తకపోయినంత మాత్రాన కరోనా వైరస్ లేదని నిర్ధారణకు రావొద్దు. శాస్త్రీయంగా ఎవరూ చెప్పలేదు. కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
Claim: If you can hold your breath for 10 sec without discomfort, you don’t have COVID-19.
Fact: Holding your breath for more than 10 seconds without discomfort does not prove whether you are infected or not. #coronavirusindia #coronavirus #IndiaFightsCorona #Mythbuster pic.twitter.com/8MSc6xcMVF
— NDMA India (@ndmaindia) March 25, 2020
వదంతులు 4) మలేరియా నివారణలో వాడే క్లోరోక్విన్ లేక హైడ్రోక్లోరోక్లిన్ కోవిడ్19 నివారణకు తోడ్పడుతుంది.
నిజం: ఇందులో నిజం లేదు. కరోనా పేషెంట్‌కు క్లోరోక్విన్, హైడ్రోక్లోరోక్లిన్ వాడాలా వద్దా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాక ప్రకటించింది. సొంతంగా నిర్ణయాలు తీసుకుని వీటిని వాడవద్దు.
Claim: Chloroquine/hydroxychloroquine, an anti-malarial drug, is effective in curing COVID-19.
Fact: False.#coronavirusindia #coronavirus #IndiaFightsCorona #MythBusters pic.twitter.com/nUj4y7m5Xc
— NDMA India (@ndmaindia) March 25, 2020
వదంతులు 5) జ్యూస్ తాగడంతో కోవిడ్19ని అరికట్టవచ్చునని ఓ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
నిజం: ఇది అవాస్తవం. ఇలాంటి చికిత్స విధానమే లేదని వైద్యులు చెబుతున్నారు.
Claim: A viral post on social media claims a State government in the country has recommended that the juice of bitter gourd is an effective treatment for COVID-19
Fact: This claim is absolutely false#coronavirusindia #coronavirus #IndiaFightsCorona #Mythbuster pic.twitter.com/Nrb5FVOk8V
— NDMA India (@ndmaindia) March 25, 2020
వదంతులు 6) పారాసెటమల్ ట్యాబ్లెట్‌తో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు ట్రీట్ మెంట్
నిజం: పారాసెటమల్తో జ్వరం తగ్గుతుంది. కరోనా వైరస్ చికిత్సకు పారాసెటమల్ సరైంది కాదు. ఈ ట్యాబ్లెట్‌ను సైతం డాక్టర్ల సలహా మేరకు వేసుకోవడం మంచింది.
Claim: Paracetamol can treat Coronavirus infection.
Fact: Paracetamol can treat one of the symptoms like fever. However, it is not a definitive treatment for COVID-19.#coronavirusindia #coronavirus #CoronaStopKaroNa #IndiaFightsCorona #SocialDistancing #StayHome#Mythbuster pic.twitter.com/hMYTrYfTes
— NDMA India (@ndmaindia) March 25, 2020