Chiranjeevi - Balakrishna : నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి పండుగకు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించడంతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో సక్సెస్ మీట్ లో భాగంగా తమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఏదైనా సినిమా సక్సెస్ అనేది చాలా గొప్ప విషయము.ఎంత డబ్బు పెట్టినా కూడా అది దొరకదని.. విజయం ఇచ్చే ఎనర్జీ చాలా బాగుంటుంది. మనం ముందుకు వెళ్లడానికి ఒక మెట్టు ఎదగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటూ తెలిపారు. అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా అది సక్సెస్ కోసమే అంటూ తెలిపారు. చాలామంది ఈ మధ్య ఎక్కువగా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారని, ఏదైనా సినిమా విజయం వెనుక నిర్మాత ఉంటాడు. కానీ పనికిరాని ట్రోలర్స్, నెగిటివ్ వల్ల సినిమాలను చంపేయకండి అంటూ తెలియజేశారు.
ఈ విషయం పైన మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నా హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో కూడా ఇంత ఆవేదన ఉండడం చూసి తనకు ఆశ్చర్యం కలిగింది అంటూ చిరంజీవి తెలిపారు. నీ మనసు ఎంత కలత చెందిందో నీ స్పందన బట్టే అనిపిస్తోంది అంటూ తెలియజేశారు చిరంజీవి. సినిమా అయినా,క్రికెట్ అయినా మరొక సామాజిక సమస్య అయినా కూడా సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు.
ఇందులో మాట్లాడే మాటల తాలూకా ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆలోచించాలని తెలిపారు. ఎవరో అన్న మాటలను స్ప్రెడ్ చేస్తే ఆ మాటల వల్ల ఎన్నో నాశనం చేయగలవు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. ముఖ్యంగా పాజిటివ్ అంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా నడిపిస్తుంది అంటూ తెలిపారు చిరంజీవి.. చివరిగా ఆలోచననాత్మకమైన మాటలు మాట్లాడావు. నా ప్రియతమా గాడ్ బ్లెస్స్ యు అంటూ చిరంజీవి వ్రాసుకొచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారడంతో చాలామంది తమన్ కి సపోర్ట్ చేయడం జరిగింది.
Also Read: YS Sharmila: 'సూపర్ సిక్స్ ఇవ్వలేక.. ఆడలేక మద్దెల దరువన్నట్టు చంద్రబాబు తీరు'
Also Read: Muppa Raja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'సస్పెండ్ ద లీడర్'.. ముప్పా రాజాపై వేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.