Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే దర్శనాలు..!

Big Alert To Tirumala Devotees: తిరుమల వెళ్లే భక్తులకు కీలక అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లు పంపిణీ ముగియడంతో టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది.. ఈ నెల 19 తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా 20వ తేదీ నుంచి సాధారణ దర్శనం కొనసాగుతుంది. దీనికి సంబంధించి గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన చేసింది టీటీడీ యంత్రాంగం.
 

1 /5

తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు ప్రత్యేక దర్శనాలను ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు కల్పించారు. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం 19వ తేదీకి ముగిస్తుంది. దీంతో 20వ తేదీ నుంచి భక్తులు సర్వదర్శనంలో క్యూ లైన్ లో మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.  

2 /5

ఈనెల 20న ప్రోటోకాల్ భక్తులను మినహాయించి విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొని భక్తులు సహకరించాలని అధికారులు కోరారు. నేటితో ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల పంపిణీ ముగుస్తుందని టీటీడీ యంత్రాంగం తెలిపింది.  

3 /5

ఈ వైకుంఠ ద్వార దర్శనం ఇప్పటివరకు సుమారు 5 లక్షలకు పైగా మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తుంది. వీరు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు.  వైకుంఠ ద్వార దర్శనం కూడా పొందారు.  

4 /5

గురువారం టిటిడి సమీక్ష నిర్వహించి ఈ నేపథ్యంలో జే శ్యామలరావు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం స్లాటెడ్‌ దర్శనం జారి శుక్రవారంతో ముగుస్తుంది. దీంతో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని 20వ తేదీ నుంచి యథావిధిగా సాధారణ దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు.  

5 /5

ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి టోకెన్లు జారీ చేయరు. సర్వదర్శనం చేసుకోవాలనే భక్తులు క్యూ లైన్ ల లోకి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవాలని శ్యామల రావు సూచించారు. ఇక శ్రీవాణి దర్శనం టోకెన్లు 19వ తేదీ కూడా ఆఫ్లైన్లో నిలిపివేసి ఉన్నట్లు ప్రకటించారు.