Nithya Menen interview: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది నిత్యామీనన్. ముఖ్యంగా తెలుగులో ఎన్నో చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె, తాజాగా ఉదయనిధి స్టాలిన్ భార్య దర్శకత్వం వహించిన కాదలిక్క నేరమిళ్లై అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. జనవరి 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
ముఖ్యంగా కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యా పాల్గొంటూ ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఆడవాళ్లు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే కనీసం మానవత్వం కూడా చూపించరు అంటూ వ్యాఖ్యానించింది.
అయితే ఒక స్నేహితుడు, దర్శకుడు, నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ కూడా చెప్పుకొచ్చింది నిత్యామీనన్. ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నిత్యామీనన్ సినిమా షూటింగ్లో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి తెలిపింది. ముఖ్యంగా నటీమణులు పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నామని చెప్పినా సరే పట్టించుకోరు.. పని మాత్రమే పట్టించుకుంటారు అంటూ వెల్లడించింది.
నిత్యామీనన్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో చాలాచోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బు పడినా.. ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్‌కి రావాలని నిర్మాత, దర్శకులు ఆశిస్తారు. మనం దానికి అలవాటు పడ్డాము. ఏది ఎలా జరిగినా మనం కష్టపడక తప్పదు అంటూ నిత్యా చెప్పుకొచ్చింది.
ఇకపోతే 2020లో చేసిన చిత్రం సైకో కోసం షూటింగ్లో ఉన్నప్పుడు తనకు పీరియడ్స్ వచ్చాయని, మొదటి రోజు షూటింగ్‌లోనే పీరియడ్స్ రావడంతో నొప్పిగా అనిపించిందని, ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ తనను అర్థం చేసుకొని తనకు అన్ని సదుపాయాలు కల్పించారని నిత్యా తెలిపింది.
నిత్యా మాట్లాడుతూ నాకు పీరియడ్స్ అని మొదటిసారి ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. మొదటి రోజు కదా అని అతడు అడిగాడు. అప్పుడే నాకు అతడిలోని సానుభూతి కనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే మీరు విశ్రాంతి తీసుకోండి అని నాతో చెప్పాడు. ఆ రోజు నేను అసౌకర్యానికి గురవుతున్నట్లు ఆయన అర్థం చేసుకుని, నాకు ఏ ఒక్క పని చెప్పలేదు. ఆడవారు ఇబ్బందుల్లో ఉంటే వారితో పని చేయించడం నాకు నచ్చదు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒకే చెబితే మీతో షాట్ చేస్తాను అని అన్నారు అంటూ తెలిపింది నిత్యామీనన్.