న్యూఢిల్లీ: భారత్‌లో మరో కరోనా వైరస్ మరణం నమోదైంది. దీంతో దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య ఐదుకు చేరుకుంది. తాజా మరణం రాజస్థాన్‌లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 69ఏళ్ల వృద్ధుడు ప్రాణాంతక కోవిడ్19 వైరస్ బారిన పడి జైపూర్‌లో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం. చనిపోయిన వ్యక్తి ఇటలీకి చెందిన పర్యాటకుడు. కార్డియాక్ అరెస్ట్‌తో జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు చికిత్స పొందుతూనే శుక్రవారం కన్నుమూశాడు. ఆ పేషెంట్లను అప్పటివరకూ డిశ్ఛార్జ్ చేయవద్దు: కిషన్ రెడ్డి
భారత్‌లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య 206కు చేరుకుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలవరకు 14,376 శాంపిల్స్ సేకరించి 13,486 శాంపిల్స్ కోవిడ్19 వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో నేడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..