K Kavitha: సంక్రాంతికి అతిపేద్ద ముగ్గు వేసి ముచ్చటపడ్డ ఎమ్మెల్సీ కవిత

K Kavitha Celebrates Sankranti Festival With Family: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. భోగి రోజు సంబరాలు చేసుకోగా.. సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి చేసుకున్నారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.

1 /5

సంక్రాంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  ఘనంగా చేసుకున్నారు.

2 /5

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోనితన నివాసంలో కుటుంబసభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలు కవిత చేసుకుని ఆనందంలో మునిగారు.

3 /5

సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా ఎమ్మెల్సీ కవిత చేసుకున్నారు. త‌న నివాసంలో గుమ్మం ఎదుట రంగురంగులతో అతిపెద్ద ముగ్గు వేసి కవిత అబ్బురపరిచారు.

4 /5

ఈ సందర్భంగా ముగ్గుపై పాలు పొంగించారు. అనంతరం పిండివంటలు వండుకుని తిని.. కుటుంబంతో ఆనందంగా గడిపారు

5 /5

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కవిత 'రైతాంగం.. పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలి' అని ఆకాంక్షించారు.