Balakrishna World Record: తెలుగులో ప్రెజెంట్ సీనియర్ టాప్ హీరోల్లో బాలకృష్ణ వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్నారు. అఖండ నుంచి అపజయం అంటూ ఎరగని హీరోగా జైత్ర యాత్ర కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీతో ఏకంగా ప్రపంచ రికార్డు సెట్ చేశారనే చెప్పాలి.
డాకు మహారాజ్ చిత్రం ఫస్ట్ డే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి దాదాపు రూ. 25.75 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 32.85 కోట్ల షేర్ తో పాటు రూ. 56 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విదేశాల్లో తక్కువ టైమ్ లోనే $1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసిన బాలయ్య మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా అమెరికాలో నాలుగు 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన హీరోగా బాలయ్య ఖాతాలో మరో రికార్డు క్రియేట్ చేసారు.
అంతేకాదు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత ‘డాకు మహారాజ్’ మూవీతో బాలయ్య మరో రికార్డు ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు డబుల్ హాట్రిక్ కు సాధించేందుకు రెడీ అవుతున్నారు.
ఇక మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమలో 60 యేళ్ల పై పడిన వయసులో వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న హీరో ఎవరు లేరు. రజినీకాంత్, మోహన్ లాల్, చిరంజీవి, ముమ్ముట్టి వంటి హీరోలు 60 ప్లస్ ఏజ్ లో విజయాలు అందుకున్న వరుసగా మూడు, నాలుగు హిట్ చిత్రాలు లేవు. కానీ బాలయ్య మాత్రం వరుసగా నాలుగు సక్సెస్ లతో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసారనే చెప్పాలి.
బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ రెండు రోజుల్లో దాదాపు 60 శాతం రివరరీతో పాటు రూ. 48 కోట్ల షేర్ (రూ. 74 కోట్ల వరకు గ్రాస్) అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పొంగల్ సీజన్ లో గట్టి పోటీలో కూడా బాలయ్య తన సినిమాతో ఏ మేరకు వసూళ్లను రాబటతాడో చూడాలి.
బాలయ్య సినిమాల విషయానికొస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 తాండవం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ‘భోగి’రోజు త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్ లో అఘోరాలు, నాగ సాధువుల నడుమ ప్రారంభమైంది. ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.