PM Modi: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు..హాజరైన ప్రధాని మోదీ

PM Modi: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు , సినీ ప్రముఖలు హాజరయ్యారు. 

1 /5

PM Modi: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు , సినీ ప్రముఖలు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. తెలంగాణ సాంప్రదాయాలు ప్రతిబించేలా భిన్నమైన ఏర్పాట్లు చేశారు. 

2 /5

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో సంక్రాంతి వేడుకలపై స్పందించారు. నా మంత్రివర్గ సహచరుడు కిషన్ రెడ్డి  నివాసంలో జరిగిన సంక్రాంతి సంబురాలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్క్రుతిక కార్యక్రమాలను వీక్షించాను అని మోదీ తెలిపారు.   

3 /5

సంక్రాంతి పొంగల్ పండగలు భారతీయుల సంస్క్రుతి వ్యవసాయ సంప్రదాయాలు ఎంతో గౌరవించే పర్వాలు అని మోదీ పేర్కొన్నారు.   

4 /5

సంక్రాంతి, పొంగల్ పండగల శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని మోదీ. ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం కలగాలని రాబోయే రోజుల్లో  సమృద్ధి  చెందిన పంటలు చేతికి అందాలని ఆకాంక్షించారు.   

5 /5

మోదీ ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను అభిమానులకు షేర్ చేశారు. ప్రజలు విశేష అభిమానం పొందారని.. సంక్రాంతి ఉత్సవాలు ఢిల్లీలో తెలంగాణ సాంప్రదాయలకు మాన్యంగా నిలిచినట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.