Team India: ఇంగ్లాండ్‌తో భారత్‌ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌: షమీ ఇన్‌.. పంత్‌, బుమ్రా ఔట్‌

Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్‌ షమీని ఎంపిక చేయగా.. రిషబ్‌ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో భారత్‌ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.

1 /6

ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులో కీలక మార్పులు జరిగాయి.

2 /6

సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో భారత్‌ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుండగా.. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.

3 /6

సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్‌ షమీని ఎంపిక చేయగా.. రిషబ్‌ పంత్‌ను పక్కనపెట్టగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు.

4 /6

టీ20 సిరీస్‌ జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, రింకూ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురేల్‌ స్థానం లభించింది.

5 /6

భారత్‌లో ఈనెల 22వ తేదీన కోల్‌కత్తాలో టీ20 సిరీస్‌ ప్రారంభం కానుండగా.. 25న చెన్నైలో రెండో మ్యాచ్‌, 28న రాజ్‌కోట్‌లో, 31న పుణెలో.. ఆఖరి మ్యాచ్‌ ఫిబ్రవరి 2వ తేదీన ముంబైలో జరగనుంది.

6 /6

ఈ సిరీస్‌ అనంతరం వన్డే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరగనుంది. ఫిబ్రవరి 6న తొలి వన్డే నాగ్‌పూర్‌లో, 9న కటక్‌లో రెండో వన్డే, 12న ఆఖరి మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.