Prabhas Marriage: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు ప్రభాస్ పెళ్లి ఎపుడు చేసుకుంటాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. 46 యేళ్ల వయసు వస్తోన్న ఇప్పటికీ సింగిల్ తన లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా 2025లో ఎట్టి పరిస్థితుల్లో డార్లింగ్ పెళ్లి చేసేయాలని ఇంట్లో వాళ్లు ఫిక్స్ అయినట్టు సమాచారం.
Prabhas Marriage: తెలుగు సహా హోల్ ప్యాన్ ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ దే. అభిమానులు మాత్రం రెబల్ స్టార్ ను డార్లింగ్ అని పిలుస్తుంటారు.
తాజాగా ప్రభాస్ మ్యారేజ్ అనుష్కతో అంటూ కొంత మంది పుకార్లు షికార్డు చేశాయి. అంతేకాదు ప్రభాస్, అనుష్కల AI ఇమేజ్ లను క్రియేట్ చేసి మరి ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి చేసేసారు అభిమానులు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.
అయితే.. 2025లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభాస్ మ్యారేజ్ చేసేయాలని వాళ్ల కుటుంబ సభ్యులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి హీరోయిన్ కాకుండా.. వాళ్ల పశ్చిమ గోదావరికి చెందిన బంధువులు అమ్మాయినే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం జిల్లాకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు వీరి పెళ్లి వచ్చే మాఘ మాసం లేకుండా వైశాఖంలో చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలో ప్రకటించనున్నారు.
లాస్ట్ ఇయర్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రభాస్ పెద్దమ్మ.. ఈ యేడాదే ప్రభాస్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు చెప్పారు. దీంతో అభిమానులు కూడా పెళ్లి డేట్ కోసం వేచి చూస్తున్నారు.
ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘కల్కి 2898 AD’ మూవీతో రెండోసారి రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ యేడాది ‘ది రాజాసాబ్’ సినిమాతో ఏప్రిల్ 10న పలకరించనున్నారు. అదే నెల 25న మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాతో థియేటర్స్ లో పలకరించనున్నాడు.
మరోవైపు హోంబలే ఫిల్మ్స్ వారితో వరుసగా మూడు చిత్రాలకు సైన్ చేసాడు. ముందుగా ‘సలార్ 2 శౌర్యాంగ పర్వం’ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాలున్నాయి. అటు ప్రశాంత్ వర్మతో నెక్ట్స్ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయింది. వీటి కంటే ముందు హను రాఘవపూడి దర్శకత్వంలో బ్రిటిష్ కాలానికి సంబంధించిన ‘ఫౌజీ’ మూవీతో పలకరించబోతున్నాడు.