Obama-Trump: ఒబామా-ట్రంప్ ఏం మాట్లాడుకున్నారో తెలిసిపోయిందోచ్...ఇదిగో వీడియో

 Obama-Trump: అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య ఈమధ్యే చోటుచేసుకునన సంభాషణ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో ట్రంప్, ఒబామా ఇద్దరూ కూడా సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వారు ఏం మాట్లాడుకున్నారు..అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకూ ఏం మాట్లాడుకున్నట్లు...తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Jan 10, 2025, 08:56 PM IST
Obama-Trump: ఒబామా-ట్రంప్ ఏం మాట్లాడుకున్నారో తెలిసిపోయిందోచ్...ఇదిగో వీడియో

 Obama-Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ మధ్యే మరణించారు. అయితే ఆయన అంత్యక్రియల కార్యక్రమాలకు మాజీ అధ్యక్షుడ బరాక్ ఒబామా..కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ డ్రంప్ తోపాటు కమలా హారిస్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు రహస్యంగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. అయితే వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

అయితే తాను ఇప్పుడు మాట్లాడలేనని..ఓ ప్రశాంతమైన ప్రదేశం కావాలని ట్రంప్ చెప్పినట్లు లిప్ లీడర్స్ అంచనా వేస్తున్నారు. నేను దాన్నుంచి బయటపడ్డాను. అదీ పరిస్థితి. మీరు ఊహించగలరా అని ట్రంప్ అంటుంటే ఒబామా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తర్వాత ఆ సంభాషణ అలాగే కొనసాగింది.  ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని..అందుకోసం ఓ ప్రశాంతమైన ప్రదేశం అవసరమంటూ ట్రంప్ చెప్పినట్లు లిప్ రీడర్స్ అంచనా వేస్తున్నారు. అయితే వీటిని ఇంటర్నేషనల్ మీడియా అధికారికంగా ధ్రువీకరించలేదు. మరోవైపు ఒబామా ట్రంప్ మాట్లాడుకుంటున్న సమయంలో వారి ముందుగానే కమలా హారిస్ దంపతులు కూర్చొన్నారు. 

 

Also Read: Post Office Scheme: సూపర్ డూపర్ స్కీమ్.. రూ. 5లక్షలకు రూ. 15లక్షలు మీ సొంతం  

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు ఈమధ్యే జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులుతోపాటు మాజీ అధ్యక్షులు కూడా హాజరయ్యారు. వారందరూ ఒకేచోట కూర్చొన్నారు. ఈక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పక్కన బరాక్ ఒబామా కూర్చొన్నారు. కొంత సమయానికి వీరిద్దరి మధ్య డిస్కషన్ షురూ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అంతర్జాతీయంగా ఆసక్తిగా మారింది. 

Also Read: GST: జీఎస్టీ పోర్టల్ సర్వర్ డౌన్.. చివరి తేదీ ముంచుకొస్తుంటే ఇదేంటని తలలు పట్టుకుంటున్న వ్యాపారులు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

 

Trending News