Allu Arjun Issue: బన్నీ వ్యవహారంలో కీలక పరిణామం.. గాంధీ భవన్ లో అల్లు అర్జున్ మామకు ఘోర అవమానం..

Allu Arjun Issue: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య లేనట్టుగా అల్లు అర్జున్ వ్యవహారమే రచ్చ లేపుతోంది. ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చిన ఆయనకు అక్కడ ఘోర అవమానం ఎదురైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 23, 2024, 03:37 PM IST
Allu Arjun Issue: బన్నీ వ్యవహారంలో కీలక పరిణామం.. గాంధీ భవన్ లో అల్లు అర్జున్ మామకు ఘోర అవమానం..

Allu Arjun Issue: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. ఇప్పటికే సంధ్య థియేటర్స్ లో డిసెంబర్ 4న జరిగిన ఘటనలో రేవతి మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పరిణామాలు నెలకొన్నాయి. మొత్తంగా ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ మా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తన అల్లుడి పట్ల పూర్తిగా కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షిని కలవడానికి ప్రయత్నించారు. అయితే.. అక్కడ అల్లు అర్జున్ మామకు ఘోర అవమానం ఎదురైంది.

చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికి వచ్చినా.. ఆయన  మాట్లాడకుండానే దీపా దాస్ మున్షీ పింపించినట్లు సమాచారం. దాంతో గాంధీ భవన్‌ నుంచి చంద్రశేఖర్‌రెడ్డి వెనుదిరిగారు. దీంతో ఈ వ్యవహారం ఇపుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న.. తమ ప్రభుత్వం తన అల్లుడు అల్లు అర్జున్ పై ఇలా కక్ష్య పూరితంగా వ్యవహరించడం పట్ల ఆయన పార్టీ తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఆయన తన సన్నిహితుల  వద్ద చెప్పుకొని బాధ పడినట్టు తెలుస్తోంది.

మొత్తంగా ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా తయారైంది. పుష్ప 2 సక్సెస్ మీట్ లో తన పేరు మర్చిపోవడంపై రేవంత్ ఒకింత ఆగ్రహానికి గురైయ్యారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచి తనను ఇండస్ట్రీ పెద్దలు ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంచి రాపో మెయింటెన్ చేసిన సినీ పెద్దలు.. రేవంత్ రెడ్డిని అంతగా పట్టించుకోవడం లేదు. పైగా ఆయన్ని లైట్ తీసుకున్నారు. మొత్తంగా ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో సిని ప్రముఖులకు తన పవర్ రుచి ఏంటో చూపిస్తున్నాడు. మొత్తంగా సినీ నటులు ఎవరు పై నుంచి ఊడి పడలేదన్న భావన వాళ్లలో తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రేవంత్ ఈ పని చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కామన్ పీపుల్ మాత్రం ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి ఏ సమస్య లేనట్టు అల్లు అర్జున్ ఇష్యూను పట్టుకునే ఎందుకు వేలాడుతుందనే క్వశ్చన్స్ వేస్తున్నారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News