CV Anand Apology: తెలంగాణలో అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ అన్నట్టు వ్యవహారం కొనసాగుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట అంశంపై వాస్తవాలు వివరించే ప్రయత్నం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచక్షణ కోల్పోయారు. కొన్ని ప్రశ్నలు అడిగి మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో దెబ్బకు ఆయన దిగివచ్చారు. క్షమాపణలు ప్రకటించారు. సహనం కోల్పోయానని అంగీకరించారు.
Also Read: Tollywood: తెలంగాణకు బై బై! సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లనుందా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశంపై హైదరాబాద్‌లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. ఈ సమయంలో మీడియా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ సమయంలో కమిషనర్ ఆనంద్ విచక్షణ కోల్పోయి మీడియాపై దరుసుగా ప్రవర్తించారు. కొన్ని ప్రశ్నలు అడిగిన మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. 'నాకు తెలుసు జాతీయ మీడియా ఏం చేస్తోంది. మీరంతా ఈ సంఘటనకు మద్దతుగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి సిగ్గు లేదు. ఇది నేను అర్థం చేసుకున్నది' అంటూ వ్యాఖ్యానించి వెళ్లారు.
Also Read: Snakes Attack Video: పాముల దండయాత్ర.. చిక్కినట్టే చిక్కి తుర్రుమన్న 'తొండ'
అతడు చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియా మొత్తం ఈ వ్యాఖ్యలను తప్పుబట్టాయి. తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఈ విషయాన్ని గ్రహించిన సీవీ ఆనంద్ స్పందించారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఓ పోస్టు చేశారు. 'రెచ్చగొట్టేలా వరుసగా ప్రశ్నలు సంధించడంతో సహనం కోల్పోవాల్సి వచ్చింది. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నా. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసి తప్పు అని భావిస్తున్నా. జాతీయ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా' అని సీవీ ఆనంద్ పోస్టు చేశారు.
అంతకుముందు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డిసెంబర్ 4వ తేదీన జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలను కమిషనర్ విడుదల చేశారు. అల్లు అర్జున్‌దే తప్పు అనే కోణంలో కమిషనర్ వివరణ ఉండడం గమనార్హం. పోలీస్ వ్యవస్థ మొత్తం తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌దే తప్పని పేర్కొంటోంది.
I apologise for losing my cool when asked continuous provoking questions on ongoing investigations and making unnecessary general remarks about national media . I feel bad that I got provoked and it was wrong and should have kept calm .I withdraw my remarks wholeheartedly 🙏🏻
— CV Anand IPS (@CVAnandIPS) December 22, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.