Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. బెయిల్ ఆర్డర్ రద్దుకు మరో పిటిషన్..?..

Pushpa2 stampede incident:  పుష్ప2 సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో బిగ్ షాక్ చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. పోలీసులు దీనిపై మరల తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తొంది. 
 

1 /6

పుష్ప2 మూవీ రిలీజ్ వేళ జరిగిన సంఘటన ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంటుందని తెలుస్తొంది. ఇప్పటికే దీనిపై పోలీసులు అరెస్ట్ చేసి అల్లుఅర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా అనేక నాటకీయ పరిణామల నేపథ్యంలో సింగిల్ బెంచ్ కోర్టు మధ్యంతర బెయిల్ ను జారీ చేసింది.   

2 /6

గంటల కొద్ది ఆలస్యంగా.. పోలీసులు రిలీజ్ చేయడం కూడా.. ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అల్లు అర్జున్ తరపు లాయర్ లు మాత్రం.. పోలీసుల ప్రవర్తించిన తీరుపై మాత్రం కోర్టు ధిక్కరణ కేసులో పిటిషన్ వేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంధ్య థియేటర్.. పోలీసుల భద్రత కోరుతూ.. పోలీసులకు లేఖను రాసింది.

3 /6

 అయితే.. పోలీసులు కూడా.. సంధ్య థియేటర్ వద్ద ఇన్ , అవుట్ గేట్ ఒకవైపుకు ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమాకు భారీగా ఫ్యాన్స్ వస్తారని, పోలీసులు అనుమతించలేదని రిప్లై ఇచ్చినట్లు తెలుస్తొంది.   తాము వద్దని చెప్పిన కూడా.. మూవీ టిమ్ వచ్చినట్లు పోలీసులు తాజాగా వాదనలు విన్పిస్తున్నారని తెలుస్తొంది. అదే విధంగా.. ప్రీమియర్ షో ఘటన మాత్రం పెనుదుమాంగా మారిందని చెప్పుకొవచ్చు. దీనిపై ప్రస్తుతం పోలీసులు మరల హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తొంది. 

4 /6

హైకోర్టు ఇచ్చిన సింగిల్ జడ్జీ మధ్యంత బెయిల్ ను కొట్టివేయాలని మరో పిటిషన్ ను పోలీసులు దాఖలు చేస్తున్నట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం పెనుదుమారం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. 

5 /6

మరొవైపు ఈ బెయిల్ ను కనుక కోర్టు కొట్టివేస్తే.. అల్లుఅర్జున్ ను మరల పోలీసులు అదుపులోకి తీసుకుంటారని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.   

6 /6

ఇక సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట నేపథ్యంలో జరిగిన.. రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు.. శ్రీతేజ్ మాత్రం.. సీరియస్ పరిస్థితుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.