CM Chandrababu Naidu on Polavaram Project: పోలవరం నిర్మాణంపై నిపుణుల రిపోర్టుపై కేంద్రం వద్దకు వెళ్లామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఫేజ్-1 లేకపోయినా క్రియేట్ చేశారని.. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. 2026 అక్టోబరు నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్ మొత్తం తిరిగారు. డయా ఫ్రం వాల్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి.. ప్రాజెక్ట్ పనులపై పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించారు.
"పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కంప్లీట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేశాం.. పీపీఏ, నిపుణులు, సీడబ్ల్యూసీ వాళ్లు 3 రోజులపాటు వర్క్ షాప్ పెట్టారు. సమాంతరంగా డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తాం. జనవరి 2వ తేదీన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని ఆదేశించాం.. డిసెంబర్ 10న ఈసీఆర్ఎఫ్ డ్యాం-1 పనులు ప్రారంభిస్తాం. 2026 ఫిబ్రవరి నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యాం-1 పనులు పూర్తి అవుతాయి. ఈసీఆర్ఎఫ్ డ్యాం-2 పనులు మొదలయ్యాయి. 2027 డిసెంబర్‌కు ముందే పనులు పూర్తి చేయాలని చెప్పాం..
2026 మే-జూలై లోపు చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. 2026 నుంచే నీటిని స్టోరేజీ చేసుకునే పరిస్థితి రావాలి. ఏడాదిన్నరలోగా కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ పూర్తవ్వాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులు 2026 జూన్‌లోగా పూర్తవ్వాలి. 2027 జూలై కంటే ముందే స్పిల్ ఛానల్ పెండింగ్ పనులు పూర్తవ్వాలి. ఎడమ కాలువ కనెక్టివిటీ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు మొదలయ్యాయి. ఇరిగేషన్ టన్నెల్ పనులు 2027 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలి. మొత్తం 16,450 ఎకరాల భూసేకరణ చేయాలి. ఈ పనులన్నీ 2025 ఏప్రిల్ 25 నాటికి పూర్తి చేయాలి. ఆర్ అండ్ ఆర్ కూడా 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పోలవరం టైమ్ షెడ్యూల్‌ను వివరిస్తాం..
2026 అక్టోబర్ నాటికల్లా పోలవరం పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. క్లియరెన్సెస్ విషయంలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలి. నదుల అనుసంధానంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. త్యాగాలు చేసినవారినే కాదు చెడును చేసేవారిని కూడా గుర్తించుకోవాలి. గత ప్రభుత్వ పాలన మొత్తం విధ్వంసం. ప్రజాస్వామ్యంలో ఒక్కోసారి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. 2019లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యుంటే 2021 కి పోలవరం పూర్తయ్యుండేది. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ఎగతాళి చేశారు. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయ్యుండేది. పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిసీమ ప్రాజెక్టు శ్రీరామ రక్షగా మారింది. నాశనం చేసిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను దేవుడు మాకు అప్పగించాడు..
రాష్ట్రం రెండు కళ్లు పోలవరం, అమరావతిని పొడిచి అంధకారం సృష్టించారు. దేశ చరిత్రలో ఒక ప్రాజెక్టును 28 సార్లు సందర్శించిన ఏకైక ముఖ్యమంత్రి నేనే.. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టు పోలవరం.. చెరిచే వాడ్ని చూస్తే ప్రతిఒక్కరికీ చులకన.. బెదిరించే వాడ్ని చూస్తే ప్రతిఒక్కరికీ భయం.." అని చంద్రబాబు అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.