అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. కాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గాన్ని పర్యటించనున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న వాతావరణం నెలకొని ఉందని స్థానికులు తెలిపారు.
ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ- టీడీపీల మధ్య తీవ్రమైన రభస జరుగుతోంది. అయితే 15 రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పర్యటన ముగిసినప్పటికీ బ్యానర్ల తొలగింపునకు వైసీపీ శ్రేణులు అంగీకరించక పోగా ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సాధారణంగా ముఖ్యనాయకుల పర్యటన ఉన్నప్పుడు రెండు రోజులు ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుని తొలగిస్తారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం పెద్దిరెడ్డి వచ్చి 15రోజులు అయినా ఇప్పటివరకూ బ్యానర్లు తొలగించలేదని, ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీకి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు తెలిపారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
చంద్రబాబు ఇలాఖాలో టెన్షన్ టెన్షన్...