Zomato Gets GST Demand : ప్రముఖ ఫుడ్ డెలీవరీ సంస్థ జొమాటోకు దిమ్మతిరిగే షాకిచ్చారు జీఎస్టీ అధికారులు. మరోసారి జీఎస్టీ డిమాండ్ నోటీసులు పంపించారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై రూ. 803.4 కోట్ల మేర జీఎష్టీ బకాయిలు చెల్లించాలని ఈ నోటీసులు వచ్చాయి. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్బంగా జొమాటో కంపెనీ పేర్కొంది.
2019 అక్టోబర్ 29వ తేదీ నుంచి 2022 మార్చి 31వ తేదీ వరకు ఈ మధ్య కాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు రూ. 401.70కోట్లుగా పేర్కొంటూ మహారాష్ట్రలోని ఠాణె జీఎస్టీ ఆఫీస్ నుంచి జొమాటోకు ఉత్తర్వులు అందాయి. దీనిపై వడ్డీ, పెనాల్టీ కింద మరో 401.70కోట్లు చెల్లించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని జొమాటో కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. అయితే దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీన్ని తీవ్రమైన కేసుగా పరిగణిస్తూ..దీనిపై తాము న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతామని జొమాటో తెలిపింది. నిజానికి గతంలోనూ జొమాటోకు ఇలాంటి జీఎస్టీ బకాయి నోటీసులు అందించిన సంగతి కూడా తెలిసిందే.
Also Read: Home Loan: సీనియర్ సిటిజన్లు హోంలోన్ తీసుకోవచ్చా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే
అయితే జొమటోలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో 3 అంశాలు ఉంటాయి. దానిలో ఆహార పదార్థాల ధర కూడా ఒకటి ఉంటుంది. మరోటి ఫుడ్ డెలివరీ ఛార్జీ. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి దీని నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. మూడోది ఆహారధర, ప్లాట్ ఫామ్ ఫీజు పై 5శాతం ట్యాక్స్ ఉంటుంది. ఈ ట్యాక్స్ ను జీఎస్టీ మండలి 2022 జనవరి నుంచి అమలు చేస్తోంది.
జొమాటో కంపెనీకి రూ. 803.4కోట్ల మేర జీఎస్టీ డిమాండ్ నోటీస్ రావడం ఆ కంపెనీ షేర్లు శుక్రవారం భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే దాదాపు 2శాతం షేర్లు నష్టపోయింది.
Also Read: Hyderabad Real Estate: హైదరాబాద్ శివారులో ఓ కుగ్రామం..ఇప్పుడు రియల్ హాట్ ప్రాపర్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.