7/G Movie OTT Streaming: గత కొన్నేళ్లుగా ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలను తెలుగు ప్రేక్షకుల కోసం ఆహా ఓటీటీ ప్రత్యేకంగా డబ్ చేసి రిలీజ్ చేస్తోంది. ఈ కోవలో కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 7/G చిత్రం ఇపుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కుమారుడు రాహుల్‌తో కలసి కొత్త ఇంట్లోకి వస్తారు. అక్కడ వర్ష పారానార్మల్ యాక్టివిటీస్ ని ఫేస్ చేస్తూ ఉంటోంది.
వారి ఇంటిని, ఫ్యామిలీని కాపాడుకోవడానికి అతీంద్రియ శక్తులతో వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే చాలా ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ప్రేక్షకులను సీట్లకు అతుక్కు పోయేలా చేయడంలో ముందుంది. ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో ఉంచే థ్రిల్లర్ గా చూపించారు. ఇప్పుడీ చిత్రం అందరి ఫేవరేట్ ఆహా ఓటీటీలో భవానీ మీడియా ద్వారా డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ ను కట్టిపడేసే ఈ హారర్ థ్రిల్లర్ ని ఆహా ఓటీటీలో ఎట్టిపరిస్థితిలో మిస్ కావద్దు.
సోనియా అగర్వాల్ విషయానికొస్తే.. ఈమె తమిళం, తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కాదల్ కొండెన్, 7G రెయిన్ బో కాలనీ, పుదుపెట్టాయ్ వంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తమిళంలో హిట్టైన 7G రెయిన్ బో కాలనీ మూవీని తెలుగులో 7G బృందావన్ కాలనీ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సెల్వ రాఘవన్ నే సోనియా అగర్వాల్ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా వీళ్లు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సోనియా అగర్వాల్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా .. కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తోంది.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.