Red Fruits: ఉరుకులు పరుగుల బిజీ ప్రపంచంలో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. ముఖ్యంగా ఈ 5 రకాల రెడ్ ఫ్రూట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
స్ట్రా బెర్రీ ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తాయి. గుండె వ్యాధుల ముప్పును దూరం చేస్తుంది
రాస్‌బెర్రీ బెర్రీలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో రాస్ బెర్రీ కీలకమైంది. రుచికరమైంది. పోషకాలతో నిండి ఉంటుంది. రాస్ బెర్రీ తినడం వల్ల కార్డియోమెటాబోలిక్ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి
ఆపిల్ ఇటీవల ఓ అధ్యయనంలో ఆపిల్ గురించి ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ 40 శాతం వరకూ తగ్గిపోతుంది. ఆపిల్ తినడం వల్ల గుండె వ్యాధులతో మరణించే ముప్పు తగ్గుతుంది.
టొమాటో టొమాటోలో లైకోపీన్ అనే పవర్‌ఫుల్ ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గుండె వ్యాధుల్ని దూరం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. టొమాటో క్రమం తప్పకుండా తింటే గుండె వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుందంటారు
చెర్రీ చెర్రీలో ఏంథోసయానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్వెల్లింగ్ సమస్యను దూరం చేస్తాయి. గుండె నాళాల్ని హెల్తీగా ఉంచుతాయి. రాత్రి పడుకునే ముందు చెర్రీ పండ్లు తినడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది.