Pushpa 2 Records: బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప 2’ న్యూ రికార్డ్స్.. వెయ్యి కోట్ల క్లబ్బులో ఎంట్రీ..?

Pushpa 2 Sets New Records At Box Office: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచి ఆ తర్వాత ప్రీమియర్స్ .. ఫస్ట్ డే ఇలా ప్రతి చోటా తనదైన శైలిలో వసూళ్లను కురిపిస్తూ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది.

 

1 /7

Pushpa 2 Sets New Records At Box Office: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాల్గో చిత్రం ‘పుష్ప 2’. పుష్ప 1 ది రైజ్’ మూవీతో తొలి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఇపుడు ఈ సినిమా ఫస్ట్ డే హిందీతో పాటు తెలుగు బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులకు పాతర వేస్తూ దూసుకుపోతున్నాడు.

2 /7

మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌  ‘పుష్ప 2’ చిత్రాన్ని చిత్రాన్ని  నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో భారత్ లోనే  సరికొత్త రికార్డును నెలకొల్పింది. దాదాపు రూ. 621 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. మొత్తంగా రూ. 623 కోట్ల షేర్ (రూ.1200 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టాలి. ఈ ఊపు చూస్తుంటే.. ఇదేమంత కష్టమైన పనికాదనిపిస్తోంది.

3 /7

‘పుష్ప 2’  సినిమా విడుదల రోజు ముందే ప్రీమియర్‌ ద్వారా మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు హిందీలో ఫస్ట్ డే అత్యధిక  రూ. 72 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఔరా అనిపించింది. అంతేకాదు అతి తక్కువ సమయంలో ఐదు రోజుల్లో రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేసిన సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఐదు రోజుల్లో ఈ సినిమా హిందీ వెర్షన్ మన దేశంలో రూ. 339 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

4 /7

ముఖ్యంగా ‘పుష్ప 2’ మూవీలో  అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. వరల్డ్ వైడ్ గా  సినీ లవర్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా మన దేశంలోనే  ఈ చిత్రం రికార్డుల పరంపర క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ డే నుంచి ఐదో రోజు వరకు ప్రతి రోజు సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఐదు రోజుల్లో రూ. 900 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ తుక్కు రేగొడుతోంది. అంతేకాదు ఓవర్సీస్ నార్త్ అమెరికాలో $10 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది.

5 /7

ముఖ్యంగా పుష్ప 2 బాలీవుడ్ మార్కెట్ లో దుమ్ము దులుపుతోంది.  దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్‌ కైవసం చేసుకున్నారు. మొత్తంగా అతి తక్కువ టైమ్ లో ఈ సినిమా ఫస్ట్ వీక్ లోపు  రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరడం పక్కా అని చెబుతున్నారు.

6 /7

మొత్తంగా ఒక రికార్డు క్రియేట్ చేస్తూ.. మరొక రికార్డుకు రెడీ అవుతోంది పుష్ప 2 మూవీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 213 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే తెలుగులో రూ. 150 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర రూ. 65 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 500 కోట్ల షేర్ (రూ. 900 కోట్ల గ్రాస్) తో దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 160 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది.

7 /7

ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది.  ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు.