Pushpa 2 Hindi Collections:
టాలీవుడ్ హీరోలు సైతం ఈ మధ్య పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రిలీజ్ చేస్తూ అన్ని భాషలలో అలరిస్తూ ఉన్నారు.. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేసిన స్టార్ సెలబ్రిటీలు సైతం ఇప్పుడు అవాక్కయ్యేలా తెలుగు సినీ పరిశ్రమ చేస్తోంది.
ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ అయితే తమ సినిమాలతో రూ.100 కోట్లు రాబట్టాలి అంటే చాలా కష్టపడుతున్నారు.. షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ వంటి చిత్రాలు లేకపోతే బాలీవుడ్ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితులలో ఉండేది.
ఇప్పుడు అలాంటిది బాలీవుడ్ లో ఒక డబ్బింగ్ సినిమాతో అల్లు అర్జున్ రికార్డులు మోత మోగిస్తున్నారు పుష్ప చిత్రం మొదటి రోజే రూ.72 కోట్లు రాబట్టి జవాన్ రికార్డులను సైతం తిరగరాసింది.. రెండవ రోజు, మూడవ రోజు కూడా రూ.74 కోట్లు రాబట్టి తన రికార్డును తానే మరొకసారి బద్దలు కొట్టారు అల్లు అర్జున్. ఏకంగా మూడు రోజులలోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు.. ముఖ్యంగా పుష్ప -2 చిత్రం మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
ఈరోజుతో అన్ని చోట్ల కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా బుకింగ్స్ ఉన్నాయని పలువురు సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షో లో పుష్ప-2 కొనసాగుతూనే ఉంది.. ఇక ఈ రోజున భారీ కలెక్షన్స్ తో రాబోతున్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈరోజు ముగిసే సమయానికి సుమారుగా ఈ చిత్రానికి సంబంధించి రూ 700 కోట్లు రాబట్టబోతున్నట్లు సమాచారం. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో పుష్ప-2 సినిమా హవ కాస్త తగ్గినప్పటికీ అధిక టికెట్ల కారణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడులో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయట.. అయితే ఇటీవలే పుష్ప టికెట్లను రెండు తెలుగు రాష్ట్రాలలో తగ్గించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే మరో రెండు మూడు రోజులలో రూ .1000 కోట్లు రావడం ఖాయమని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.. దీన్ని బట్టి చూస్తే పుష్ప-2 కలెక్షన్స్ ని ఇప్పట్లో ఎవరైనా బీట్ చేయగలరా అని అనుమానం కూడా మొదలవుతుందట.
Read more: Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook