Pushpa team with Chiranjeevi:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైన సినిమా పుష్ప 2. 2021 లో విడుదలై బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా రెండవ భాగంగా ఈ చిత్రం తెరకెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా బన్నీ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.
అంచనాలను అందుకుంటూ విడుదలైన మొదటి రోజు నుంచి.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చిత్రా నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవి శంకర్, సీఈవో చెర్రీ లతోపాటు చిత్ర డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ పుష్ప టీం మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ మధ్యనే ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. పుష్ప 1 సినిమా చూశానని మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమా ఇంకా చిరంజీవి చూడలేదు. త్వరలోనే చిరంజీవి పుష్ప 2 సినిమా కూడా చూడబోతున్నారు.
Also Read: Teacher Murder: ఏపీలో దారుణం.. గొడవను ఆపిన టీచర్‌ను చంపేసిన విద్యార్థులు
చిరంజీవిని కలవడానికి పుష్ప బృందం రావడంతో మెగా అభిమానులు బాగానే సంతోషిస్తున్నారు కానీ.. అల్లు అర్జున్ కూడా వచ్చి ఉంటే బాగుండేది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. మౌత్ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల ఐటెం సాంగ్ లో కనిపించింది. దేవి శ్రీ ప్రసాద్ తో పాటు తోపాటు సాన్సియస్ తమన్ కూడా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు అనసూయ సునీల్ ఫాజిల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు.
Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.