తెలివిగా ప్లానేశారు.. కానీ దొరికేశారు..

విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు వేయని ప్లాన్లు అంటూ ఉండవు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి . . బంగారాన్ని దిగుమతి చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఒకరు షూస్ లో పెట్టుకొస్తే .. మరొకరు మరో ప్లాన్ వేస్తారు. సరిగ్గా ఇలాగే ఆరుగురు వ్యక్తులు ప్లాన్ వేశారు.

Last Updated : Feb 13, 2020, 09:46 AM IST
తెలివిగా ప్లానేశారు.. కానీ దొరికేశారు..

విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు వేయని ప్లాన్లు అంటూ ఉండవు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి . . బంగారాన్ని దిగుమతి చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఒకరు షూస్ లో పెట్టుకొస్తే .. మరొకరు మరో ప్లాన్ వేస్తారు. సరిగ్గా ఇలాగే ఆరుగురు వ్యక్తులు ప్లాన్ వేశారు. బంగారాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. కానీ శంషాబాద్ విమానాశ్రయంలోనే దొరికిపోయారు.  

 దుబాయి నుంచి హైదరాబాద్​కు అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 1,581 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో నుంచి ఓ ప్రయాణికుడు సూట్​ కేసుతో దిగాడు. ఆ సూట్ కేసును విమానాశ్రయంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాడు. అనుమానం వచ్చి ముగ్గురిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు జైపూర్ నుంచి హైదరాబాద్​కు విమానంలో వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. 

సూట్ కేసులో 931 గ్రాముల బంగారంతో తయారు చేసిన సుత్తిని తీసుకొచ్చినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.  ముంబయిలోనూ ఇదే తరహాలో..ముంబయి విమానాశ్రయంలోనూ ఇదే తరహాలో ఓ ప్రయాణికుడు దుబాయి నుంచి దిగాడు. అతని సూట్ కేసు ముంబయి విమానాశ్రయంలోనే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాడు. ఆ సూట్ కేసులోనూ 931 గ్రాముల బంగారం ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దుబాయి నుంచి వచ్చిన విమానంలోనే హైదరాబాద్​కు చేరుకున్న మరో ఇద్దరు ప్రయాణికుల వద్ద కూడా 650 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

మొత్తంగా ఆరుగురి అరెస్ట్ 

నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తీసుకొచ్చిన ఆరుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్​తో పాటు ముంబయి విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న 2,512 గ్రాముల బంగారం విలువ కోటి పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.

 

Trending News