Cheetah Attack: పులుల సంచారంతో తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన ఏర్పడింది. పులులు సంచరిస్తున్న విషయం తెలిసీ కూడా అటవీ ప్రాంతంలో విహరించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పులి దాడిలో మహిళా మృతి చెందడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి పరిహారం అందించింది.
Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్ ప్రజలకు తెలుసు'
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఈజ్గాంలో గన్నారం మండలవాసి కల్యాణి మరణించిన విషయం తెలిసిందే. కల్యాణి కుటుంబానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.10 లక్షల పరిహారం శనివారం అందించారు. ఈ విషయాలను అటవీ శాక మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. 'పత్తి సేకరణకు వెళ్లిన కల్యాణి పులి దాడిలో మరణించడం ఎంతో వేదనకు గురి చేసింది. అటవీ శాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. నష్ట పరిహారంతో పాటు వారి కుటుంబ అవసరాల మేరకు సహాయ, సహకారాలను అందిస్తాం' అని సురేఖ ప్రకటించారు.
Also Read: Seethakka: పాలు సరఫరా చేస్తా లేదా? విజయ డెయిరీపై మంత్రి సీతక్క ఫైర్
సిర్పూర్ (టి) మండలంలోని దుబ్బగూడెంలో సురేశ్ అనే రైతుపై పులి దాడి జరగడంపై కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్ఓ నీరజ్‌ను అడిగి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. రైతు పరిస్థితి నిలకడగా ఉందని డీఎఫ్‌ఓ చెప్పారు. ప్రస్తుతం పులి కదలికలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర వైపు పులి కదలికలను గుర్తించినట్టుగా డిఎఫ్ఓ మంత్రికి తెలిపారు. పులి దాడి ఘటనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువులను మేతకు తీసుకొని పోయేవారు జాగ్రత్తగా ఉండాలని.. అటవీ శాఖ సూచనలను పాటించాలని మంత్రి సురేఖ ప్రజలకు సూచించారు.
పులి సంచారానికి సంబంధించిన జాడలు కనిపించడం, పులిని చూసినట్లుగా ఎవరైనా సమాచారం అందిస్తే సమీప ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని అటవీ అధికారులకు కొండా సురేఖ సూచించారు. పులి దాడి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పులి దాడి నుంచి బయటపడడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సురేఖ అటవీ అధికారులకు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter