Constipation Remedies: మలబద్ధకం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఇది ఆహారం జీర్ణమయ్యే విధానంలో వచ్చే ఒక రకమైన అంతరాయం. మనం తినే ఆహారం, జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించే ఆహార పదార్థాలు:
ఆపిల్, పేరు, బాదం, అంజీర, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, చిలగడదుంప ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటని తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్య తగ్గుతుంది. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, పాలకూర, గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్, రాగి, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కందిపప్పు, తువరపప్పు ఇవి కూడా మలబద్ధకాని తగ్గిస్తాన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోజూ తగినంత నీరు తాగడం మలబద్ధకం నివారణకు చాలా ముఖ్యం. సూప్, జ్యూస్ వంటి ద్రవ ఆహారాలు కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దోసకాయ, కర్డ్ వంటి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎక్కువగా తినాల్సిన ఆహారాలు:
ఆకుకూరలు: పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి.
పప్పులు: పప్పులు ప్రోటీన్, ఫైబర్‌కు మంచి మూలం.
పండ్లు: అన్ని రకాల పండ్లు ఫైబర్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
తక్కువగా తినాల్సిన ఆహారాలు:
ఎర్ర మాంసం: ఎర్ర మాంసం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటుంది.
పాల ఉత్పత్తులు: కొంతమందికి పాల ఉత్పత్తులు మలబద్ధకాన్ని తీవ్రతరం చేస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు: బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు ఫైబర్ తక్కువగా ఉంటాయి.
ఎందుకు ఈ ఆహారాలు మంచివి?
మలం మృదువుగా చేసి, జీర్ణవ్యవస్థ సులభంగా పని చేయడానికి సహాయపడతాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, మలం సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాను పెంచి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దోహదపడతాయి.
జీవనశైలి:
వ్యాయామం జీర్ణ వ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. నడక, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు మలబద్ధాన్ని తగ్గిస్తాయి. మలవిసర్జన కోరిక వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. ఒత్తిడి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, యోగా, ధ్యానం వంటివి చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరిపడా నిద్ర లేకపోతే జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. ఉదయం పరగడుపున వెచ్చని నీరు తాగడం మలబద్ధాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణాన్ని మలబద్ధాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
Disclaimer: ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebook
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.