Smitha Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ షోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.. ప్రతి విషయాన్ని ఆమె తన అభిమానులు, ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఆమె ఏ పని చేసినా సంచలనమే.. ఇప్పుడు స్మితా సబర్వాల్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. ఉన్నపళంగా స్మితా సబర్వాల్ గుడ్ బై ఎందుకు చెప్పారు. ఆమె అంత ఎమోషనల్‌గా ఆ పోస్టు ఎందుకు పెట్టాల్సి వచ్చింది. వీడ్కోలు పలకాల్సిన సమయం స్మితాకు ఎందుకు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరికి వీడ్కోలు చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే ఆమె ట్వీట్ వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది.
ఇటీవల స్మితా సబర్వాల్‌కు టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు కేసీఆర్ సీఎంవోగా స్మితా సేవలందించారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. కొద్దిరోజులు స్మితాకు పోస్టింగ్ ఇవ్వలేదు.. కొద్దిరోజుల విరామం తర్వాత ఆమెకు ఫైనాన్స్ సెక్రటరీగా గ్రూప్ వన్ స్థాయి పోస్టింగ్‌ను కేటాయించారు. కానీ ఇటీవల ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో బిజీబిజీ అయిపోయారు. ప్రస్తుతం టూరిజం శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్.. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించారు. దాంతో నెలరోజుల పాటు అక్కడ విదులు నిర్వహించారు. బుల్దానా, మల్కాపూర్‌లో ఎలక్షన్ జనరల్ అబ్జార్వర్‌గా విధులు నిర్వహించారు. ఈనెల 23న మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. దాంతో నవంబర్ 24న తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు స్మితా సబర్వాల్.. అయితే నెల రోజులపాటు మహారాష్ట్రలో విధులు నిర్వహిచండంతో అక్కడి ప్రజల ప్రేమను తలుచుకుంటూ స్మితా సబర్వాల్ ఎమోషనల్ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక మహారాష్ట్రలో విధులు నిర్వహించిన సమయంలో ప్రజల ప్రేమాభిమానాలు మరిచిపోలేనివి.. మీ ప్రేమను వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందని ఆ ట్వీట్‌లో స్మితా రాసుకొచ్చారు. అయితే స్మితా సబర్వాల్ ఎక్కడికి వెళితే అక్కడి ప్రజలతో వెంటనే కలిసిపోతారనే టాక్ ఉంది. అంతేకాదు తాను విధులు నిర్వహించే ప్రాంతాల్లో ఎక్కువగా సందర్శించడం కూడా ఆమెకు ఓ మంచి హాబీ అట. అందుకే ఆమె ఎక్కువగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. అలాగే ఇక్కడ తాను దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. స్మితా సబర్వాల్ నెట్టింట ఏ పోస్టు పెట్టినా విపరీతమైన ఆదరణ ఉంటుంది..
మొత్తంగా స్మితా సబర్వాల్ స్పెషల్ డ్యూటీ ముగియడంతో రాష్ట్రానికి తిరిగి చేరుకున్నారు. ఇక నెలరోజుల క్రితం టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన స్మితా మేడమ్.. రానున్న రోజుల్లో తెలంగాణలో పర్యాటకశాఖకు మంచి గుర్తింపు తీసుకురావాలని యోచిస్తున్నారట. ఇప్పటికే రాష్ట్రానికి ప్రతిరోజు లక్షల మంది పర్యాటకులు, విదేశీ యాత్రికులు వస్తుంటారు.. అయితే ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనే ఆలోచనలో స్మితా సబర్వాల్ ఉన్నారట. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సైతం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా స్మితా మేడమ్ ఏ పని చేసినా సంచలనంగా మారుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని సంచనాలతో ముందుకు నడుస్తారో..!
Also Read: YS Sharmila: అదానీ ఒప్పందంపై జగన్ తన బిడ్డలపై ప్రమాణం చేయాలి.. జగన్‌కు వైఎస్ షర్మిల ఛాలెంజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.