తలపతి విజయ్‌ను ప్రశ్నించనున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు

దక్షిణాది నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే ఒకరైన తలపతి విజయ్‌పై ఆదాయ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. 2019లో విజయ్ నటించిన బిజిల్ చిత్రం బాక్సఫిస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచం మొత్తం మీద రూ.300 కోట్లు వసూలు చేసింది.

Last Updated : Feb 5, 2020, 11:46 PM IST
తలపతి విజయ్‌ను ప్రశ్నించనున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు

చెన్నై: దక్షిణాది నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే ఒకరైన తలపతి విజయ్‌పై ఆదాయ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. 2019లో విజయ్ నటించిన బిజిల్ చిత్రం బాక్సఫిస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచం మొత్తం మీద రూ.300 కోట్లు వసూలు చేసింది. 

ఈ చిత్రాన్ని ఎజిఎస్ సినిమాస్ అనే సంస్థ నిర్మించగా, ఎజిఎస్ సినిమా ఆస్తులపైన, ఫిలిం ఫైనాన్షియర్ అంబు చెలియన్ నివాసం పైన మధురైలో ఆదాయం పన్ను శాఖ దాడులు జరిగాయి. నైవేలీ బొగ్గు గనుల వద్ద షూటింగ్ లో ఉన్న విజయ్ వద్దకు ఆదాయం పన్ను అధికారులు చేరుకుని సమన్లు జారీ చేశారు. చెన్నైకు ఆయన రాగానే విచారణ ప్రారంభిస్తారని చెన్నై ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఆది నుండి బిజిల్ చిత్రం కథ విషయంలో పలుమార్లు వివాదమైనప్పటీ విషయం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News