KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్..

ktr on tribal girl Shailaja death: గిరిజన బాలిక అత్యాచార ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 26, 2024, 01:10 PM IST
  • మరోసారి రేవంత్ కు చుక్కలు చూపించి కేటీఆర్..
  • కనీసం అది కూడా తెలిదా అంటు సెటైర్లు..
KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్..

ktr fires on cm revanth reddy: తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిపోయిందని బీఆర్ఎస్ కేటీఆర్ అన్నారు.ఈ నేపథ్యంలో ఆయన గిరిజన బాలిక శైలజ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్ నుంచి మాట్లాడారు.  20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన బాలిక ఘటన ఎంతో కలిసి వేసిందన్నారు.

కాంగ్రెస్ సర్కారు కొలువు దీరాక.. గురుకులాల్లో 48 మంది విద్యార్ధులు చనిపోయారన్నారు. చాలా మంది విద్యార్థులకు చదివించే స్థోమత లేక.. సర్కారు హస్టల్ లోకి పంపిస్తారని అన్నారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం.. విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ఇది ప్రభుత్వం చేయించిన హత్యలంటూ ఎద్దేవా చేశారు.

తన నియోజక వర్గం.. ఎల్లారెడ్డి పేట్ లో ఓ విద్యార్థి గురుకుల పాఠశాలలో చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే ఆ తల్లిదండ్రులు తమలాంటి కడపుకోత వేరే వారికి రాకుండా చూడాలని చెప్పారన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదన్నారు.  ఆ కుటుంబాల తరఫున.. శాసన సభలో కూడా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని కేటీఆర్ అన్నారు. 

కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. విద్యార్థులు ఎవరైన..  ఆరోగ్యం బాగాలేకపోతే మేము ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ లో.. ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహలు కన్పిస్తున్నాయన్నారు. మహా రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ బొర్లా బొక్క పడిందన్నారు. అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీ.. రేవంత్ కు చివాట్లు పెట్టారన్నారు. రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న విధంగా సీఎం కుర్చీ ఎక్కి.. కావాల్సినంత దోపిడి చేశారన్నారు. ఇంకా ఈ బూతులు తిట్టడం ఎందుకని అన్నారు.

నిన్న ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత.. చిట్టినాయుడు చిప్ దొబ్బినట్లు అన్పించిందన్నారు. బీఆర్ఎస్.. అదానీకి ప్రాజెక్ట్ లు ఇచ్చామంటాడు. ప్రజల్ని పూర్తిగా తప్పుదొవపట్చించేలా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. రక్షణ శాఖ కు ఇచ్చిన ప్రాజెక్ట్ లు తామిచ్చాడని అంటున్నాడని..  రక్షణ శాఖ మా చేతిలో ఉంటుందా?.. మరీ రాజ్ నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నట్లు?.. అంటూ కేటీఆర్ సెటైర్ లు వేశారు. విద్యుత్ ప్రాజెక్ట్  కూడా కేంద్రం ఇచ్చిందే.

ఇంత తెలివి తక్కువ గా మాట్లాడితే ఏం అనుకోవాలంటూ రేవంత్ కు కేటీఆర్ చురకలు పెట్టారు. చిట్టి నాయుడుకు ఏమీ తెలియదు. పోనీ..  ఎవరన్న చెప్పిన వినడు. ఆయన మూర్ఖుడంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యాడు. 

మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు....రెండో సారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు కేటీఆర్ చెప్పారు.  కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడని అంటున్నారు.  మైక్రో సాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని.. అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు.  

 సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర గౌరవం మంటకలుస్తుందని సెటైర్ లు వేశారు.  గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలు అయిన విషయం గుర్తు చేశారు. మైక్రో సాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చిందని.. అమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు.  తాను.. అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశాడు. బరాబర్ దావోస్ లో కలిశాను. ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్ లో పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. నీలాగా ఇంటికి పిలిపించుకోని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదని..  కోహినూరు హోటల్ లో కాళ్లు పట్టుకోలేదంటూ ఎద్దేవా చేశారు. 

తనకు.. నీ లాగా లుచ్చా పనులు చేసే అలవాటు లేదని, ఏదీ చేసిన బజాప్తా చేస్తామంటూ ఫైర్ అయ్యారు. కొండారెడ్డి పల్లిలో నీకోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు గురించి కూడా మాట్లాడారు. ప్రశ్నిస్తే.. సైకో అంటున్నవని ఎద్దేవా చేశారు. శైలజ అనే విద్యార్థి చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే.. తమ  పార్టీ నేత కోవా లక్ష్మి గారు వెళ్తా ఉంటే ఆమె హౌజ్ అరెస్ట్ చేశారని అన్నారు.

Read more: TGPSC Groups- 2: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్2 ఎగ్జామ్‌ వాయిదా వార్తలపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన..

అనిల్ జాదవ్, జాన్సన్ నాయక్ లాంటి నేతలను కూడా అరెస్ట్ చేశారని.. పరామర్శించేందుకు వెళ్తే..నీకు కలిగే నొప్పి ఏంటని కేటీఆర్ మండిపడ్డారు.  ఇంటర్ నెట్ షట్ డౌన్, అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలు ఇదే ప్రజా పాలనా?.. అంటూ  కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News