Revanth Reddy Brothers: ముఖ్యమంత్రి సోదరుల వేధింపులతో వృద్దుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఈ సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలు.. వేధింపులు ఎలా ఉన్నాయో రేవంత్ స్వగ్రామంలో జరిగిన సంఘటనే నిదర్శనమని గులాబీ పార్టీ పేర్కొంది. వృద్ధుడి ఆత్మహత్యపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి: Revanth Brothers: సీఎం సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య.. రేవంత్ రెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర ఆరోపణలు
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడంపై బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్, హరీశ్ రావు స్పందించారు. కేటీఆర్ పత్రికా ప్రకటనను విడుదల చేసి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కాదు ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: Temple Theft: తెలంగాణ ఆలయాల్లో వరుస చోరీలు.. 'దేవుడా నీకు నీవే రక్ష'
'ఆత్మహత్యకు ముందు లేఖలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి సోదరులు తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టంచేసిన నేపథ్యంలో దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేఖ ఆధారంగా అనుముల సోదరులపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. రేవంత్ రెడ్డి సోదరుల అరాచకాలు తట్టుకోలేక పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
'ఇది ఆత్మహత్య కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య. ఆరు నెలల క్రితం ఒక యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో అతడి ఇంటి ముందు పశువుల దవాఖానాను కట్టారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు ప్రయత్నించడంతోనే సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు' అని కేటీఆర్ వివరించారు. 'రెండుసార్లు కొండారెడ్డిపల్లికి సర్పంచ్‌గా సేవలందించిన సాయిరెడ్డి గౌరవించాల్సింది పోయి 85 ఏళ్ల వయస్సున్న పెద్దాయనను వేధింపులకు గురిచేయడం దారుణం' అని పేర్కొన్నారు.
'సాయిరెడ్డి ఆత్మహత్యకు రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. పోలీసులు మృతుడి లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. 'కొడంగల్‌లో గిరిజన ఆడబిడ్డలపై దమనకాండను దేశం మరిచిపోకముందే.. సీఎం స్వగ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నది చూస్తుంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి.. ఆయన సోదరుల ఆరచకాలకు అంతేలేకుండా పోయింది' అని కేటీఆర్ తెలిపారు. 'ఇది ప్రజాపాలన కాదు.. అరాచక పాలన, నియంత పాలన, దుర్మార్గపు పాలన' అని తీవ్ర విమర్శలు చేశారు.
హత్యానేరం పెట్టాలి
'కొండారెడ్డి పల్లె మాజీ సర్పంచి సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసింది . సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం. రేవంత్ నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఉసిగొల్పిన వాళ్లపై చట్టరీత్యా చర్యలకు సిద్ధమా? మీ అన్నదమ్ముల అరాచకాలు శృతి మించాయనడానికి ఇది నిదర్శనం కాదా? సాయి రెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ములపై చట్టరీత్యా హత్యానేరం పెట్టాలి'
- హరీశ్ రావు, మాజీ మంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter